ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Mon,November 12, 2018 02:37 AM

- కలెక్టర్ శ్వేతామొహంతి
వనపర్తి అర్బన్ : వనపర్తి శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుంచి ప్రా రంభమై ఈనెల 19న ముగుస్తున్నందున ఎన్నికల పోలింగ్ స్టేషన్‌లలో ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ శ్వేతామొహంతి తెలిపారు. ఆదివారం తన ఛాంబర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నమోదు ప్రక్రియ నవంబర్ 9 వరకు వచ్చినవి జాబితాలో పొందుపరచామన్నారు. గతంలో 57 శాతం న మోదు 62 శాతం మంది ఓటర్లుగా నమోదు అ య్యారని, డుప్లికేట్లు 600 వరకు తొలగించామని పే ర్కొన్నారు. నియోజకవర్గానికి వీవీ ప్యాట్‌కు 280 వరకు వచ్చాయని 50 శాతం అదనంగా తెప్పించామన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్స్ పొలిటికల్ పార్టీల లీడర్ల సమక్షంలో పూర్తి స్థాయిలో పరీక్షించి శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఎన్నికలలో విధులలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

ఇప్పటి వరకు ప్రతి పోలింగ్ స్టేషన్‌లలో 40 వేల మందికి వీవీ ప్యాట్‌ల ద్వారా ఓటు వేసే విధానం అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఓటరు వీవీ ప్యాట్స్ ద్వారా తాను ఏ అభ్యర్థికి ఓ టు వేసింది తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఈవీ ఎం, వీవీ ప్యాట్స్‌లు పోలింగ్ స్టేషన్ రవాణా చే యడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రూట్ ఆఫీసర్లును నియమించామని, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌లో 4 గురు చొప్పున పీవో, ఏపీవోతో పాటు ఇద్దరు ఉంటారని, పోలింగ్ స్టేషన్‌లలో పాల్గొనే సిబ్బందికి 12 నుంచి శిక్షణ ఉంటుందన్నారు. వికలాంగులకు కోసం ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో భద్రత కోసం స్టేట్ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ జవానులు బందోబస్తు ఏర్పా టు చేస్తామని, ఓటింగ్ సమయంలో ఓటర్లకు భ యపెట్టిన, సీ విజిల్ యాప్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించామన్నారు. స్టేషన్‌లలో పిచ్ కాస్టి ంగ్ ఏర్పాటు చేస్తామని ప్రతి పోలింగ్ స్టేషన్లను ప్ల యింగ్ స్కాడ్, అన్ని వేళాలా సందర్శించామన్నా రు. అలాగే ఇప్పటి వరకు క్రిమినల్ కే సులు 5, బైండోవర్ కేసు 400, నగదు 11 లక్ష ల వరకు పట్టుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...