ప్రశాంత ఎన్నికలకు కసరత్తు


Sun,November 11, 2018 05:14 AM

వనపర్తి క్రైం : సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా పోలీస్ యంత్రాంగం కసరతు ప్రారంభించింది. ముందుగా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జగరకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో శాంతిపరిరక్షణను చేపట్టిన చర్యలను పర్యవేక్షించేందుకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ రేంజ్ ఐజీపీ స్టీపెన్ రవీంద్ర జిల్లాకు వచ్చారు. పోలీసులు తీసుకుంటున్న ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తుతో పా టు భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశించి వెళ్లా రు. భద్రతలో భాగంగానే కేంద్ర బలగాలను జిల్లాకు ర ప్పించారు. ఓటర్లకు భరోసా కల్పించేందుకు జిల్లాలోని ప్రధానపట్టణాలలో ప్రత్యేక బలగాలతో కలిసి కవాతును చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును స్వేచ్ఛగా వేసేందుకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. పాత నేరస్తులను తహసీల్దార్ ముందు బైండోవర్ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్ల వారీగా రౌడీషీటర్ల జాబితా రూపొందించుకుని వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ఎలాంటి సమస్యలు జరగకుండా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లను సందర్శించి సమస్యాత్మక కేంద్రాలు, నేరస్తులు, వారి వివరాలను సేకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా చూడాలని పోలీసులను ఆదేశిస్తున్నారు. అంతేకాకుండా పోలీసు అధికారులు, సిబ్బంది సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుంటున్నారు.

ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉం చుకుని ఎలాంటి అభ్యంతకర పోస్టింగ్‌లు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో వాహనల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే 100 ఫోన్ కాల్ వస్తే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని, సంఘటన స్థలానికి వెళ్లిన తర్వాత అక్కడ చేయవలసిన విధుల గురించి వివరించారు. జిల్లాలో ఉన్న పెట్రోలింగ్ డ్రైవర్లు, మొబైల్స్ అధికారులు అత్యవసర ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించే విధంగా సిద్ధమవుతున్నారు. జిల్లాలో పలు చోట్ల ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలలో దాదాపు రూ.4లక్షలకుపైగా నగదు పట్టుబడడంతో సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ అధికారులకు అప్పగించారు. ప్రజలకు ఎలా ంటి ఇబ్బందులు కలుగకుండా భద్రతపై భరోసాను కల్పిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరుగకుండా తగి న ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను ఉల్లంఘించి బెల్ట్ దుఖానంలో మద్యంను విక్రయిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటున్నారు. వారిపై జరిమానాలతో పాటు కేసులను నమోదు చేస్తున్నారు. జిల్లాలో కోత్త వ్యక్తులు గాని, అనుమానితులుగా సంచరిస్తుంటే సంబందిత పోలీస్ అధికారులకు సమాచారాన్ని అంది ంచాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...