శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌గెలుపు ఖాయం


Sun,November 11, 2018 05:12 AM

వనపర్తి అర్బన్ : డిసెంబర్ 7న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గంలో, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి, మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్‌లు అన్నారు. శనివారం పట్టణంలోని 4వ వార్డు లో వార్డు కౌన్సిలర్ గొర్ల ప్రమీలమ్మతో సింగిరెడ్డి వాసం తి, 1వ వార్డులో వార్డు కౌన్సిలర్ కాగితాల శారద లక్ష్మీనారాయణలతో మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్‌లు వేర్వేరుగా స్థానిక టీఆర్‌ఎస్ నాయకులతో కలి సి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించా రు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వారన్నారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు జీవితబీమా, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ, కంటి వెలుగు, రైతులకు 24 గంటల విద్యుత్, ధ్యానం నిల్వ చేసేందుకు మా ర్కెట్ గిడ్డంగులు, ఎరువులు, విత్తనాలు వంటివి సకాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందజేయడం జరిగిందని వారన్నారు. కార్యక్రమంలో అమెరికా యూత్ ప్రెసిడె ంట్ అభిలాష్, పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్, సీనియర్ కౌన్సిలర్ వాకిటిశ్రీధర్, కౌన్సిలర్లు ఇందిరమ్మ, పార్వతి, భువనేశ్వరి, మాజీ కౌన్సిలర్ రాజు, నాయకులు వెంకటేష్, కాగితాల గిరి, బీ.కృష్ణ, మురళీ సాగర్, విష్ణు సాగ ర్, పరంజ్యోతి, దేవన్ననాయుడు, సూర్యవంశంగిరి, ప్రే మ్, మహేష్, శ్రీకర్‌గౌడ్, దొడ్ల యాది, మోహన్, శ్రీను, రమేష్, రవి, కే.లక్ష్మి, అస్లాం బిన్ ఇస్మాయిల్ ఉన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...