విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి


Sun,November 11, 2018 05:12 AM

వనపర్తి క్రీడలు : చదువులో విజ్ఞానం, క్రీడల్లో ప్రతిభను చాటుతూ క్రీడాకారులు ఉన్నతంగా రాణించాలని స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఉమ్మడి జిల్లా సెక్రటరీ పాపిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడామైదానంలో ఎస్జీఎఫ్ వారి ఆధ్వర్యంలో 64వ రాష్ట్ర స్థాయి అండర్-19 హాకీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాపిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మద్దిలేటి, ఉర్దూ కళాశాల ప్రిన్సిపాల్ జాకీర్ జ్యోతి ప్రజ్వలన చేసి హాకీ పోటీలను ప్రారంభించారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. ప్రతి క్రీడాకారుడు ఆత్మవిశ్వాసంతో కష్టంలో ఇష్టంగా అన్ని రకాల క్రీడలలో పాల్గొని జిల్లా స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జిల్లా, తెలంగాణ రాష్ట్ర పేరు నిలబెట్టాలన్నారు. క్రీడాకారులందరూ గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని గుర్తు చేశారు. వనపర్తి పట్టణం ప్రస్తుతం హాకీకి పుట్టినిళ్లుగా మారిందని, ఈ మైదానంలో ఆడిన అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, అలాంటి వారిని ఆదర్శనంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ సుధీర్‌కుమార్‌రెడ్డి,రాష్ట్ర పర్యవేక్షులు హన్మంతు, పీడీలు సురేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఉమారావు, రోహిణి, పీఈటీలు తిరుపతయ్య, శ్రీనివాసులు, వెంకటస్వామి, మురళీకృష్ణ, సీనియర్ హాకీ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...