మేము టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతాం..


Sat,November 10, 2018 01:51 AM

పెద్దమందడి : ఎట్టి పరిస్థితుల్లోనూ మేమంతా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతామని మండలంలోని దొడగుంటపల్లి గ్రామానికి చెందిన వడ్డెర సంఘం సభ్యులు శుక్రవారం విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని బలవంతంగా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కావున తామంతా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ మద్ధతు ఇస్తామన్నారు. ఈ నెల 11వ తేదీన దొడగుంటపల్లిలో నిర్వహించనున్న వడ్డెర సంఘం సమావేశానికి సంబంధించి వనపర్తిలో ఫ్లెక్సీలు చేయించుకోడానికి వెళ్లగా, కొంతమంది కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డిని కలిసివద్దామని తీసుకెళ్లి కాంగ్రెస్ కండువాలు కప్పారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు సుదర్శన్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో వడ్డెర సంఘం సభ్యులంతా మళ్లీ టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకొని పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించారు. సమావేశంలో వడ్డెర సంఘం నాయకులు బాలస్వామి, శ్రీను, రాములు, మహేష్, నరసింహ, వెంకటేష్, సింగోటం తదితరులు ఉన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...