భక్తుల చెంతకు మాతా మాణికేశ్వరి


Sat,November 10, 2018 01:51 AM

నారాయణపేట టౌన్ : మాతామాణికేశ్వరి ధర్మ సందేశ యాత్రలో భాగంగా శుక్రవారం నారాయణపేట శివారులోని పగిడిమర్రిరోడ్ మార్గంలో గల వ్యాసాశ్రమం నుంచి ప్రారంభమైంది. నారాయణ పేట నుంచి దేవరకద్ర వరకు భక్తులు అడుగడుగునా అమ్మవారికి ఘనంగా స్వాగతం పలికారు. ముందు మాత వ్యాసాశ్రమం భక్తులకు దర్శనం ఇచ్చారు. అయితే అమ్మవారి దర్శనం కోసం ఆయా ప్రాంతాల నుంచి భక్తులు ఉదయం 6 గం టల నుంచే వ్యాసాశ్రమానికి బారులు తీరారు. మాతామాణికేశ్వరి మ ధ్యాహ్నం 12.53గంటలకు పగిడిమర్రి వ్యాసాశ్రమానికి చేరుకొని అమ్మవారి దర్శనం ఇవ్వడంతో భక్తులకుతో పులకరించిపోయారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి, పేట మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, బీజేపీ నాయకులు నాగురా వు నామాజీ, రతంగపాండురెడ్డి, కొండ య్య, పేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సరాఫ్‌క్రిష్ణలు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

మాతామణికేశ్వరికి ఘన స్వాగతం
ధన్వాడ : మండల కేంద్రమైన ధన్వాడలో శుక్రవా రం మాతామాణికేశ్వరీకి ఘనంగా స్వాగతం పలికా రు. ఉదయం నుంచి అమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. 12 గంటల తర్వాత అ మ్మవారు ఆ రోడ్డున వెళ్తుండడంతో వందలాది మం ది భక్తులు దారిపొడవునా ఉండి స్వాగతం పలికారు.

పులకించిన మరికల్
మరికల్ : మాతామాణికేశ్వరి చేపట్టిన ధర్మ సందేశ యాత్రలో భాగంగా శుక్రవారం మాతామాణికేశ్వరి మరికల్ మండల కేంద్రానికి చేరుకోవడంతో భక్తులు పులకించి పోయారు. భక్తులు మాతా దర్శనానికి ఉద యం నుంచే క్యూ కట్టారు. మాతా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం ఇచ్చారు. అలాగే పెద్ద చింతకుం ట వద్ద కూడా మాతాను భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా ఎస్సై జానకీరాంరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దేవరకద్రలోనూ ఘనస్వాగతం
దేవరకద్ర, నమస్తే తెలంగాణ : మాతామాణికేశ్వరి చేపట్టిన ధర్మ సందేశ యాత్రలో భాగంగా శుక్రవారం మాతా మాణికేశ్వరి దేవరకద్ర మీదు హైదరాబాద్ వెళ్తూ కారులోంచి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు దారిపోడవునా మాతకు ఘన స్వాగతం పలుకగా మాత భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

హంస వాహనంపై.. ఊరేగిన కురుమూర్తిస్వామి
చిన్నచింతకుంట : కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారు హంస వాహనంపై ఊరేగారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం హంసవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన కురుమూర్తి స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సేవను ప్రధాన ఆలయం నుంచి ఉద్దాల మండపం వరకు నిర్వహించగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సురేందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, బత్తుల బాలరాజు, ప్రతాప్‌రెడ్డితోపాటు అర్చకులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...