ప్రతిపక్షాలకు ఓటుతో.. సమాధానం చెప్పాలి


Sat,November 10, 2018 01:50 AM

వనపర్తి అర్బన్ : ఇన్నేళ్లు తెలంగాణను అభివృద్ధి చేయకుండా ఇప్పుడు అధికార దాహంతో ప్రజల ముందుకు వస్తున్న ప్రతిపక్షాలకు ఓటుతోనే తగిన సమాధానం చెప్పాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు (పీబీవీసీ) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి, అమెరికా యూ త్ ప్రెసిడెంట్ అభిలాష్‌లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 20వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఆవుల రమేష్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సింగిరెడ్డి వాసంతి, అమెరికా యూత్ ప్రెసిడెంట్ అభిలాష్‌లు, మైనార్టీ నాయకులు ఎండీ. జహంగీర్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగున్నర ఏండ్ల లో జరిగిన అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి వనపర్తి చరిత్రలోనే భారీ మెజార్టీతో గెలిపించాలని వా రు ప్రజలను కోరారు. వార్డులో ప్రచారం చేస్తున్న సందర్భంలో వార్డు మహిళలు సింగిరెడ్డి వాసంతి బొట్టు పెడుతూ నిరంజన్ రెడ్డిని తప్పకుండా గెలిపించుకుంటామని హామీనిచ్చారు. ఈ ప్రచారంలో సీనియర్ కౌన్సిలర్ వాకిటి శ్రీధ ర్, కౌన్సిలర్లు కృష్ణయ్య, పార్వతమ్మ, ప్రమీలమ్మ, భువనేశ్వరి, ఎస్‌కె.ఖైరూన్, సతీష్‌యాదవ్, నాయకులు లక్ష్మీనారాయణ, మురళీసాగర్, రమేష్, కృష్ణయ్య, జయానంద్, చుక్కరాజు, కృష్ణ, గిరి, నారాయణదాసుకిట్టు, పరంజ్యోతి, శ్యాంకుమార్, పుష్పక్, కురుమూర్తి, మందరాము, సుభా ష్, ప్రేమ్, మహేష్, ప్రవీణ్, ప్రశాంత్, దేవన్న నాయుడు, శ్రీకర్ గౌడ్, మోహన్, గఫార్, రవిశాస్త్రి, మద్దిలేటి, శరవంద, రవి, గోపాల్ మణెమ్మ, రాము, గౌసియా, కొమ్ములక్ష్మి, షమీమ్ ఇస్మాయిల్, డానియల్, మైనార్టీ నాయకులు గులాం ఖాదర్, సర్దార్‌ఖాన్, ఎంఏ.లతీఫ్, అస్లాంబిన్ ఇస్మాయిల్, గౌస్‌కురేషి, సుభాష్ పట్టణంలోని కాలనీవాసులు తదితరులు ఉన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...