జైకొట్టిన జగత్‌పల్లి


Wed,September 12, 2018 02:43 AM

వనపర్తి రూరల్ : నియోజకవర్గంలోని ప్రతి గ్రామ చెరువు కు ఒక సారి నీళ్లిస్తే మూడేళ్ల వర కు కరువు ఉండొద్దనే లక్ష్యంతో ముందుకెళ్లుతున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ని రంజన్‌రెడ్డి స్వగృహంలో పెద్దమందడి మండలంలోని జగత్‌పల్లి గ్రామ రైతులు ఆయనను కలిసి మద్దతు ప్రకటించారు. త మ మండలానికి నీళ్లిచ్చిన మీకు ఎప్పుడూ అండగా నిలుస్తామని ఘంటాపథంగా తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ చె రువులు, కుంటలను నింపాలని భవిష్యత్‌లో ఏ నాయకుడి చుట్టూ తిరగకూడదన్న ఆలోచనతో ముందుస్తుగా ప్రణాళికలను చేపట్టి కాల్వల పనులను చేపడుతున్నామన్నారు. సాగునీరు వచ్చాక గ్రామాల్లో ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారని తెలిపారు. కూలీలకు బ్రహ్మాండమైన ఉపాధి చేకూరిందన్నారు. చెరువులలో నీటి రాకతో మత్య్సకారుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నదని, దీంతో వా రికి చేతినిండా పనిదొరికిందన్నారు. రానున్న రోజుల్లో మీ ఇండ్లకు, గల్లికి రాజకీయ నాయకులు వచ్చే రోజు లు రానున్నాయన్నారు.

నాలుగేళ్లలో నియోజకవర్గం లో 80 శాతానికి పైగా నీటిని పారించుకున్నామన్నారు. రైతులను రాజుగా చూడాలన్న సీఎం కేసీఆర్ ఆలోచననను నియోజకవర్గంలో సాకారం చేసే దిశగా తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. సాగునీరు ఊసులేని పరిస్థితి నుంచి ఇంజినీర్ల సలహాలు, సూచనల మేరకు సాగునీళ్లు తీసుకువస్తుంటే ప్రతిపక్ష నాయకుడు అడ్డుపుల్ల వేస్తున్నాడని, ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న తనను ఓడించేందుకు మిత్రపక్షాలతో కలిసి ప్రయత్నించడం తన దిగజారుడతనానికి నిదర్శనమన్నారు. వీటిన్నంటినీ ప్రజలు క్షుణంగా పరిశీలిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు పదవులు, ఓట్లు నా దృష్టిలో ముఖ్యం కాదని తెలిపారు. నా జీవితం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కష్టిస్తానని తెలిపారు. నియోజకవర్గంలో పంట సాగుకు వీలయ్యే ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ దయాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమార్ యాదవ్, నాయకులు సుఖేందర్‌రెడ్డి, కేశవరెడ్డి, మద్దిలేటి, బాలస్వామి, గట్టునాయుడు, మన్యంకొండ సాగర్, కురుమన్న, చెన్నయ్య, నారాయణ, వెంకటయ్య, ఆశన్న, బాలకిష్టన్న, పెద్దయ్య, వెంకటేష్, మాధవ్, భాస్కర్, విష్ణు, విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మద్దులయ్య, శాంతన్న, పెద్దబీచుపల్లి, స్వామి, బొక్కలన్న, రాములు, ఎర్రన్నతో పాటు 150 మంది రైతులు, నాయకులు పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...