ప్రతి చెరువునూ నింపుతాం


Wed,September 12, 2018 02:43 AM

-సాగునీటి కోసం నిరంతరం కృషి చేస్తా..
-తాత్కాలిక పాటు కాలువకు సహకరించండి
-మామిడిమాడ, సల్కలాపూర్ చెరువులకు త్వరలో సాగునీరు
-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-లట్టుపల్లి గ్రామ రైతులతో మాట్లాడిన నిరంజన్‌రెడ్డి
ఖిల్లాఘణపురం : మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలను కృష్టా నీటితో నింపి రైతులకు సాగునీటిని అందిస్తానని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామ శివారులోని ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ నుంచి మామిడిమాడ వేములవాని చెరువు, సల్కలాపూర్ పెద్ద చెరువులను నింపేందుకు గాను పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ బ్రాంచ్ కెనాల్ నుంచి మామిడిమాడ, సల్కలాపూర్‌లకు సాగునీటిని అందించేందుకు లట్టుపల్లి రైతులు సహకరించాలని కోరారు. మీరు సహకరిస్తే ఆ గ్రామాలకు తాత్కాలిక పాటు కాలువ ద్వారా చెరువులను నింపుతామన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలిగినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు సానుకూలంగా స్పందించి తాత్కాలిక పాటు కాలువను ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని తెలిపారు. త్వరలోనే ఈ రెండు చెరువులకు తాత్కాలిక కాలువల ద్వారా సాగునీరు అందిస్తానన్నారు. ఇటీవల ఈ చెరువులను సాగునీటితో నింపేందుకు ఏర్పాటు చేసిన కాలువ పనులు పూర్తికాలేదని, కావున తాత్కాలిక పాటు కాలువను ఏర్పాటు చేసేందుకు పంట పొలాలను పరిశీలించినట్లు చెప్పారు. నిరంతరం రైతుల పక్షాన ఉంటూ సాగునీటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీకు సేవలు అందిస్తానని అన్నారు. రైతులు ఇకపై అధైర్యపడాల్సిన అవసరం లేదని, రెండు పంటలకు సాగునీరు అందించే భాద్యత తనదేనని అన్నారు. రైతులు చెరువుల కింద నీటిని వృథా చేయకుండా కింది పొలాల వారికి నీటిని అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిరంజన్‌గౌడ్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...