డీలర్లు అక్రమాలకు పాల్పడొద్దు : కలెక్టర్ శ్వేతామొహంతి


Wed,September 12, 2018 02:42 AM

వనపర్తి రూరల్ : రేషన్‌డీలర్లు అక్రమాలకు పాల్పడకుండూ ప్రజలకు అందుబాటులో ఉండి స్వార్థాన్ని వీడాలని కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌకధర దు కాణాల డీలర్లకు కమీషన్ బకాయిలకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి మనస్సుతో ఎదుటి వారి ఆకలిబాధలు తీర్చినప్పుడే మనం చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఫిర్యాదులు లేని, అధికారుల తనిఖీలో రికార్డులు సక్రమంగా నిర్వహించిన రేషన్ డీలర్లకు మాత్రమే మొదటి విడుతలో రూ.21 వేల చెక్కులను 258 మంది డీలర్లకు అందజేయడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ కాని షాపులు, మరణించిన వారి, 6ఏ కేసులు పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తిగా విచారణ జరిపిన అనంతరం రెండో విడతలో పంపిణీ చేస్తామన్నారు. మొదటి విడుతలో అక్టోబర్ 2015 నుంచి ఆగస్టు 2018 వరకు రూ.1,45,73,326 చెక్కులు పంపిణీ చేయటం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, ఆర్డీవో చంద్రారెడ్డి, డీఎం లక్ష్మయ్య, డీఎస్‌వో రేవతి తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...