పేదల పక్షపాతి టీఆర్‌ఎస్ సర్కారు


Wed,September 12, 2018 02:42 AM

పెబ్బేరు : రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి అని ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 17 మంది కుటుంబాల లబ్ధిదారులకు మంగళవారం పురపాలక కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక ఆడపిల్లల పెళ్లిలు చేయడానికే గుండెలపైన భారంగా భా వించిన నిరుపేదల కుటుంబాలకు నేడు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం దేవుడు ఇచ్చిన వరంలాంటిదన్నారు. 60 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు చేయలేని అనేక అభివృద్ధి పనులను కేవలం నాలుగేళ్లలో చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎక్కడా తల వంచకుండా ప్రజలతో మమేకమై ముందుకు సా గుతూ రాష్ట్ర సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ అలుపెరుగ ని కృషి చేశారన్నారు. కొన్నేళ్లుగా నియోజకవర్గ ప్రజలు ఇద్దరి వ్యక్తులను ఆశీర్వదించినా ఒక్క ఎకరానికి సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండని, తరతరాల వారికి ఉపయోగపడేలా అభివృద్ధిని చేసి చూపిస్తానని తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ ప్ర కాష్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీటీసీ శివశంకర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, సింగిల్ విండో చై ర్మన్ గౌని కోదండా రాంరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు హరిశంకర్ నాయుడు, నాయకులు గౌడానాయ క్, ఎల్లయ్య, శి వసాయి, దిలీ ప్ రెడ్డి, జలీల్, రాయులు, నరేందర్ రెడ్డి, లబ్ధిదారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...