మల్బరీ రైతులకు ప్రభుత్వం సాయం


Wed,September 12, 2018 02:42 AM

పెబ్బేరు రూరల్ : మల్బరీ పంటను సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని నేషనల్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ సైంటిస్టు డాక్టర్ శ్రీనాథ్ అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామంలో రైతులు సాగుచేసిన మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెం పకాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మల్బరీ పంట సాగుచేసే రైతులకు అవసరమయ్యే షెడ్ల నిర్మాణానికి, సాగు ఖర్చు కిం ద ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం రైతుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఈ నేపథ్యంలోనే ఇక్కడ వసతులు మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. యువ రైతు వడ్డే రమేష్‌కు చెందిన పట్టు పురుగుల షెడ్డును అధికారుల బృందం సందర్శించింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సుజాత, అధికారులు విజయభాస్కర్, ఆర్.లక్ష్మ య్య, అపర్ణ, పెబ్బేరు ఎంపీడీవో సుజాత, రైతులు శివన్న, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...