పండుగలను సంతోషంగా నిర్వహించుకునేలా చూడాలి


Wed,September 12, 2018 02:42 AM

వనపర్తి రూరల్ : వినాయక చవితి నవరాత్రులు ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొ ని భక్తి భావం పెంపొందించుకునేలా ఆధికారులు చోరవ తీసుకోవాలని ఆర్డీవో చంద్రారెడ్డి సూచించారు. మంగళవారం ఆర్డీవో తన ఛాంబర్‌లో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ముం దస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలుగుకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండ వినాయక చవితి నిమజ్జనం ఉరేగింపు జరిగేలా పోలీస్ శాఖా వారు మండపాలు ఏర్పాటు చేసే వారికి సూచించాలన్నారు. నిమజ్జనం జరిగే ముందు రోజు నుం చి వైన్ షాపులు బంద్ చేయించాలని అందుకు ఎక్సైజ్ శాఖ వారు పూర్తి నిఘా పెట్టాలన్నారు. తాగునీటి వసతిని మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేయాలని, చెరువుల దగ్గర పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేందర్‌గౌడ్, ఆర్‌ఐ సత్యనారాయణ, ము న్సిపాల్ కమిషనర్ జి రజినికాంత్, డీటీసీ సుజా త, ఫైర్ ఆఫీసర్ కేశవులు, పీఆర్‌ఈఈ కళాధర్‌రెడ్డి, సీఐ సూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...