చిన్నారులకు అర్థమయ్యేలా బోధించాలి : కలెక్టర్ శ్వేతామొహంతి


Wed,September 12, 2018 02:42 AM

వనపర్తి రూరల్ : చిన్నపిల్లలకు సమయం ప్రకారం పౌష్టికాహారం అందించి, రక్తహీనత లేకుండా చూడడంతో పాటు అర్థమయ్యేలా బోధించాలని కలెక్టర్ శ్వేతామొహంతి అంగన్ వాడీ టీచర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శిక్షస్త్రీ ఎడ్యుకేషనల్ కన్సల్‌టెన్సీ హైదరాబాద్ వా రు అంగన్‌వాడీ టీచర్లకు ఇంగ్లీష్ విద్యాబోధనపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన కలెక్ట ర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభమని, భయాన్ని విడనాడి శిక్షకులు చెప్పేది శ్రద్ధగా వినాలన్నారు. భవిష్యత్‌లో పెద్ద స్కూల్‌లతో సమానంగా అంగన్‌వాడీ సెంటర్లలోని పిల్లలు దారాళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాలని, క్లాసురూంలలో పిల్లలను క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నారు. ప్రస్తుతం 50 మందికి శిక్షణ ఇప్పిస్తున్నామని, వనపర్తి , కొత్తకోట, పెబ్బేర్‌లలో ఏర్పాటు చేశామని, వచ్చే ఆరు నెలలో మీ పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్లు ఐడియల్ సెంటర్‌లా మారేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కళానంబియార్, లిల్లీజాసై, రత్నకుమారి, మాలిని, డయానా, డీడబ్ల్యూవో వరప్రసాద్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

మట్టిగణపతులను పూజిద్దాం..
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కలెక్టర్ శ్వేతామొహంతి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ కార్యాలయ ఆవరణలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలంగాణ కుమ్మరి శాలివాహన సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ చెరువులోని ఒండ్రుమట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలను చెరువుల్లోనే వేయడం వల్ల భూగర్భజలాలు శుద్ధి అవుతాయన్నారు. కార్యక్రమంలో కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు పరుశురాం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...