విజేతలకు బహుమతుల అందజేత


Wed,September 12, 2018 02:41 AM

వనపర్తి విద్యావిభాగం : స్వచ్చ పక్షోత్సవాలలో భా గంగా జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసంలో గెలుపొందిన విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారులు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సెక్టోరియల్ అధికారులు గణేష్, చంద్రశేఖర్ మాట్లాడు తూ స్వచ్చ పక్షోత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి వ్యాసరచన, పెయింటింగ్, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించామన్నారు. 130 మంది హాజరు కాగా 12 మంది విజేతలుగా నిలిచారన్నా. విజేతలు 14న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి స్వచ్ఛ పక్షోత్సవాలలో పా ల్గొననున్నట్లు తెలిపారు. ఆయా విభాగాల్లో యశ్వంత్, సాయిరాం, యమున, మహేశ్వరి, ఆర్.స్వామి, శివశంకర్, లక్ష్మీ, సంధ్య, చంద్రశేఖర్, శ్రీలత, త్రివేణి, శోభ లు విజేతలుగా నిలిచారు. అనంతరం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు భాష సం ఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సుధీర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...