స్వచ్ఛత కోసం ఆలోచించాలి


Wed,September 12, 2018 02:41 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలంటే స్వయంగా ఆలోచన రావాలని కలెక్టర్ శ్వేతామొహంతి పేర్కొన్నారు. మంగళవారం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకం నేపథ్యంలో మండలంలోని మోట్లంపల్లి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ చెప్పడం బాధాకరమన్నారు. ఎవరి ఇంట్లో మరుగుదొడ్డి ఉంటే వారికే ఆరోగ్యకరం.. దానికోసం ఎవ్వరు పట్టించుకోవాలి. మీకు సొంతంగా ఆలోచన వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా కొంత సహకారమందిస్తుందన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ పథకం ద్వారా ఇచ్చే రూ.12 వేలు సరిపోవడం లేదంటే మ రో రూ.2 వేలు కూడా మీరు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

ఇంట్లో టీవీలు, రెం డు, మూడు సెల్‌ఫోన్లు ఉంటాయి కానీ మల విసర్జనకు మాత్రం బహిరంగంగా వెళ్లడం ఎంత వరకు స బబని అన్నారు. ఇంట్లో ఆడకూతుళ్ల ఆత్మగౌరవం కం టే ఇంకేం కావాలని అడిగారు. జిల్లాలో అత్యల్ప మ రుగుదొడ్లు ఉన్న గ్రామంలో మోట్లంపల్లి ఉండడంతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. గ్రామంలో 420 ఇండ్లు ఉండగా 110 ఇండ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉ న్నాయన్నారు. 2018వ సంవత్సరంలో కూడా ఇంత వెనకబడి ఉండటం తనకు అవమానకరంగా ఉందన్నారు. ఇప్పటికే గ్రామానికి రూ. 19 లక్షల నిధులు మంజూరై ఉన్నాయన్నారు. గ్రామస్తులు ముందుకు రాకపోవడంతో నిధులు ఖర్చు కావడం లేదన్నారు. అంతకుముందు గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఇంటింటికీ తిరుగుతూ మరుగుదొడ్లపై ఆరాతీశారు. కారణాలను కనుగొని వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా గ్రామంలోని అంబేద్క ర్ విగ్రహానికి పూలమాల వేసి స్వచ్ఛత కోసం అంబేద్కర్, గాంధీల స్ఫూర్తితో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించాలని కోరారు. జిల్లా సమాచార పౌర సంబందాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మే రకు తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాబృందం ఆధ్వర్యంలో కళజాత ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, ఎంపీటీసీ దేవరాజ్, ఇన్‌చార్జి డీఆర్‌డీవో నాగశేషాద్రి సూరి, స్వచ్ఛభారత్ జిల్లా ప్రేరక్ భరత్, తహసీల్దార్ మోహన్, ఎంపీడీవో శ్రీపాద్, ఏపీవో సుకన్య, ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శి, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...