పెబ్బేరు టౌన్ / పెబ్బేరు రూరల్ : మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంజన్‌రెడ్డి గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు విస్త్రతంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మంగళవారం అంబేద్కర్ కాలనీలో వీధులలో డప్పులతో ర్యాలీ నిర్వహించి వార్డులోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌కు, నిరంజన్‌రెడ్డికి తోడుగా ఉంటూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అలాగే పెబ్బేరు మండలంలోని రాంపురం గ్రామంలో మంగళవారం మాజీ సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకలు వీధుల్లో తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి వెంకటరమణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, మండల అధ్యక్షుడు హరిశంకర్ నాయుడు, ఎంపీటీసీ ఐజాక్, మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, కోఆప్షన్ సభ్యులు ముస్తాక్, నాయకులు మేకల ఎల్లయ్య, భానుప్రకాష్‌రెడ్డి, వెంకటరమణ, చిన్న ఎల్లారెడ్డి, గంధం వెంకటయ్య, దీలిప్రెడ్డి, సంతోష్, వేణుగోపాల్, సిద్దిరాములు, శాంతన్న, రాము, గోవింద్, జగదీష్, జ్యోతి, భారతి, మల్లికార్జున్, మహేశ్వర్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, బాలరాజు, లక్ష్మన్న, బీసన్న, మొగులన్న, బీచుపల్లి, తిరుపతయ్య పాల్గొన్నారు.