డ్రామాలకు కాలం చెల్లింది


Tue,September 11, 2018 01:42 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పేరే కాదు.. బుద్ధి కూడా చిన్నదే అని ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని ఉద్దేశిం చి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దగూడెం సమీపంలో ఎంజే-4 కాలువ పనులకు సోమవారం ఆయన భూమి పూజ చేశా రు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో నిరంజన్‌రెడ్డి రైతులనుద్దేశించి మాట్లాడారు. పెబ్బేరు, గోపాల్‌పేట మండలాలు గతంలో వేరే నియోజకవర్గాల పరిధిలో ఉండేవని, అప్పుడు అక్క డి నేతల వల్ల వాళ్లకు సాగునీరు వచ్చిందన్నారు. కానీ వారి వల్ల వనపర్తి నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఏదైనా ప్రాజెక్టు పరిధిలోని కాలువల తవ్వకాలు జరుగుతుంటే మన ప్రాంతానికి అనుకూలంగా ఉందా లేదా.. సర్వేలో మ న పరిధిలోని గ్రామాలకు నీళ్లు వస్తాయా లేదా అనేది స్థానిక నేతలు చూడాలన్నారు. కానీ వనపర్తికి ఎమ్మెల్యేలుగా పనిచేసిన చిన్నారెడ్డి, రావులలు అవేమీ పట్టించుకోలేదని విమర్శించారు. ఎంజీకేఎల్‌ఐ వనపర్తిపై నుంచి.. భీమా కాలువ కింది నుంచి పారుతుంది.. కా నీ ఎంజీకేఎల్‌ఐ డీ-8 పరిధిలోని చాలా గ్రామాలు ఆ యకట్టుకు నోచుకోలేదని తెలిపారు.

అప్పటి ఈపీసీ పద్ధతి వల్ల కాలువలు ఇష్టానుసారంగా తవ్వి సదరు ఆ యకట్టు అందించామని కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారని అన్నారు. అలైన్‌మెంట్ అప్రూవల్ పూర్తయిందని.. దత్తాయిపల్లి నుంచి పెద్దగూడెం ఖాన్ చెరు వు వరకు సర్వే పనులు పూర్తైన వెంటనే పనులు ప్రా రంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే చి న్నారెడ్డి మాత్రం అభివృద్ధిని ఓర్వలేక కాలువ పనుల ను అడ్డుకుంటున్నాడని తెలిపారు. రైతాంగానికి మంచి చేస్తుంటే ఇంతటి దుర్మార్గం చేస్తారా.. ద్రోహం, అన్యాయానికి ఒడిగడతారా అని ప్రశ్నించారు. ఈ కుట్రలు చూస్తుంటే రక్తం ఉడుకుతోందని, ఆయన పేరే కాకుం డా బుద్ధి కూడా చిన్నదేనని అన్నారు. కడుపునిండా వి షం నింపుకున్నాడని, ప్రజలు సంతోషంగా ఉంటే ఓ ర్వలేని వ్యక్తి అని విమర్శించారు. మిగతా వారిలా తా ను మాత్రం ఓట్ల కోసం ప్రాణం పోయినా అబద్ధాలు ఆడనని తెలిపారు. చిన్నారెడ్డి వనపర్తి కలెక్టర్‌కు ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదు వివరాలను నిరంజన్ రెడ్డి మీడియాకు అందించారు. ఖాన్ చెరువునకు నీటిని తీసుకువచ్చేందుకు ఎలాంటి అవకాశం లేకున్నా.. నిరంజన్‌రెడ్డి ప్రజలను మోసగిస్తున్నాడని అందుకే వెంటనే ఆ భూమి పూజ జరగకుండా ఇంజినీరింగ్ అధికారులకు సూచన చేయమని కలెక్టర్‌కు చేసిన ఫోన్ ఫిర్యాదు ప్రతిని రైతులకు చూయించారు.

రోషముంటే ముక్కు నేలకు రాయాలి..
వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన శంకర స ముద్రం రిజర్వాయర్‌ను అసంపూర్తిగా వదిలేయడం వల్ల ఆయకట్టుకు నీళ్లు రాని పరిస్థితిని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అప్పట్లో చిన్నారెడ్డి డ్రా మాగా అభివర్ణించారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. శంకరసముద్రంలో 600 మీటర్ల మేర కట్ట పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల రిజర్వాయర్‌ను నింపలేని పరిస్థితి ఉండేదన్నారు. ఇంజినీరింగ్ నిపుణుల సూచనతో రింగ్ బండ్ వేసి నీటిని కాలువ ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేస్తే.. నీళ్లు రావు ఏమీ రావు డ్రా మా ఆపండంటూ వెటకారంగా చిన్నారెడ్డి వ్యాఖ్యానించినట్లు గుర్తు చేశారు. నీళ్లు వస్తే ముక్కు నేలకు రాస్తా అన్న చిన్నారెడ్డి.. ఇప్పుడు రోషముంటే, చీమునెత్తురు ఉంటే ముక్కు నేలకు రాయాలన్నారు. కళ్లుంటే వెళ్లి శంకరసముద్రం ద్వారా వస్తున్న నీటిని చూసి రావాల ని.. లేదంటే కంటివెలుగులో ఇస్తున్న అద్దాలు పెట్టుకు ని చూడాలని చిన్నారెడ్డికి హితవు పలికారు.

వనపర్తికి సాగునీరు రాకుండా చేయడమే కాకుండా గతంలో తెలంగాణ అవసరం లేదంటూ వైఎస్‌కు అనుకూలం గా ఆర్టికల్ రాసిన చరిత్ర చిన్నారెడ్డిదన్నారు. పైన నీళ్లున్నాయని.. పొలాల్లో సాగు చేసుకునేందుకు రైతులు సి ద్ధంగా ఉన్నారని.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రైతు సమన్వయ సమితిని ముందు పెట్టి పనులు చేయిస్తామన్నారు. వాళ్లు చేయరు.. చేస్తుంటే ఓర్వలేక అడ్డుకుంటరు.. ఇదే వారి నైజం. కానీ నేను మాత్రం రైతుల ప క్షం. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. మరుసటి రోజునుం చే ప్రజల్లో ఉన్నాను. ఓడినా నియోజకవర్గానికి ఏమడిగినా ఇవ్వడానికి మన సీఎం, మన మంత్రులే ఉన్నారన్న ధీమాతో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని అ న్నారు. రైతులకు సాగునీరు అందించడమే తమ ముం దున్న కర్తవ్యమన్నారు. వ్యవసాయంలో దేశంలోనే వనపర్తి అగ్రగామి జిల్లాగా ఉండాలన్నదే తన తాపత్రయమని తెలిపారు. కాలువ పనులు జరిగేందుకు రైతులు కూడా సహకరించాలని, భూమి కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామన్నారు.

ఓటమికి భయపడి పోటీకి దిగనంటున్నడు..
వనపర్తిలో పోటీ చేస్తే ఓడిపోతా.. నాకు చేతనైత లే దు.. నీకు నా సీటిస్తా రా అంటూ రావులకు మాజీ ఎమ్మెల్యే ఆఫర్ ఇస్తున్నారని.. వాళ్లు సీట్లు మార్చుకుంటే ప్రజలే వాళ్లను మార్చేస్తారని నిరంజన్ రెడ్డి అన్నారు. కానాయపల్లిలో రెండు సార్లు పరిహారం తీసుకున్న రావుల త న ఇంటినే ఖాళీ చేయలేదని విమర్శించారు. అంత రాజకీయ అనుభవం ఉన్న రావుల సొంత గ్రామస్తులను ఎందుకు ఒప్పించలేకపోయారని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న నిరంజన్‌రెడ్డిని అడ్డుకునేందుకు ఒక్కటవుతారన్నారు. ద్రోహం చేస్తుందెవరో ప్రజలకు తెలుసన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...