రైతులు, పేదల సంక్షేమానికి కృషి


Tue,September 11, 2018 01:41 AM

-పనిచేసేవారికే ఓట్లు వేయాలి : పీబీవీసీ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు నాయకులు
వనపర్తి రూరల్ : రైతులు, పేదల సంక్షేమానికి రా ష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి అభివృద్ధికి సీ ఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెద్దగూడెం శివారులో ఖాన్ చెరువు కాలువకు భూమి పూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశంలో మండలంలోని రాజనగరం, వనపర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్, టీడీపీల నాయకు లు, కార్యకర్తలు సోమవారం నిరంజన్‌రెడ్డి సమక్షం లో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజల సుఖాన్ని కోరుకునేది టీఆర్‌ఎస్ అయితే.. నోటి కాడి కూడు గుంజుకునే ప్రయత్నం చేసేది మాత్రం కాంగ్రెస్, టీడీపీ నాయకులేనన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవటమే పరమావధి గా పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైతే చీకటిగా అవుతుందన్న కాంగ్రెసు నాయకుల ఆలోచనలను తలకిందులు చేస్తూ మిగులు కరెంట్ దిశగా ప్రభుత్వం ముందుకు సా గుతున్నదన్నారు. నియోజకవర్గంలో సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నా రు. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టేందుకు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం తనకు రాదని, ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయని, నిరంతరం సేవ చేసేవాడికే ఓట్లు వేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో రాజనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నాగన్న యాదవ్, వ నపర్తి పట్టణానికి చెందిన వివిధ వర్గాల నాయకులు భాస్కర్‌రెడ్డి, వెంకటాచారి, తరుణ్‌గౌడ్, సురేష్, సురేఖ, రాఘవేంద్రచారి, శంకరాచారి, గోవిందమ్మ, వెంకటయ్య, భాగమ్మ, గోపాల్, వడ్లకొండ, శివరాములు, రఘు, మాసుంబీ, జాఫర్, రహీం, గంగన్న, శ్రీనివాసులు, లావణ్య, శారద, మహేష్, జనార్దన్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పెద్దగూ డెం తండా, మెంటపల్లి, కడకుంట్ల గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...