ప్రతి విద్యార్థి పేరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి


Tue,September 11, 2018 01:41 AM

వనపర్తి విద్యావిభాగం : ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సెక్టోరియల్ అధికారులు గణేష్, చంద్రశేఖర్‌లు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. యూడైస్, శాలసిద్ది, చైల్డ్ ఇన్‌ఫో, తదితర ఆంశాలను ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులకు సమాచారం అందజేయాలన్నారు. ఎలాంటి సందర్భంలో కూడా తప్పుడు నమోదును చేపట్టకూడదన్నారు. పిల్లలయొక్క పరీక్ష వివరాలను ఎఫ్1, ఎఫ్2 ఫలితాలు కూడా అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ తదితరులు ఉన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...