ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి


Tue,September 11, 2018 01:41 AM

వనపర్తి రూరల్ : ఎన్నికలను ప్రశాంతంగా నిష్పక్షపాతంగా, నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఎస్కే జోషి అన్నారు. సోమవారం అయిన హైదరాబాద్ నుంచి వనపర్తి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఎన్నికల విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగాలు సంసిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యం గా రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే పోస్టులు ఖాళీలు ఉంటే తక్షణమే తెలియజేయాలని తెలిపారు. ఎన్నికల విషయమై ఈనెల 12న హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశానికి కలెక్టరులు, ఎస్పీలు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కలెక్టర్, ఎస్పీలు ఒక బృందంలా ఏర్పాటై ఎన్నికలను జిల్లా విజయవంతంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈనెల 28న తేదీ నిర్వహించనున్న పంచాయతీ కార్యదర్శుల పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్లుతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎన్నికలను నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల ఉమ్మడి తనిఖీ, రూట్‌ల ఏర్పాటు, సమస్యాత్మాక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికలకు అవసరమైన బందోబస్తు తదితర అంశాలను ఒక బృందంగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. వీసీలో జిల్లా అధికారులు కలెక్టర్, ఎస్పీ, శిక్షణ కలెక్టర్ పాల్గొన్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఏలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ శ్వేతామొహంతి ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికలపై ఏఈఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందని, దీనికి సంబంధించిన ఈనెల 10వ తేదీ నుంచి 25 వరకు అభ్యంతారాల స్వీకరణ, 15, 16 తేదీలలో ప్రచార కార్యక్రమం, అక్టోబర్ 4న అభ్యంతరాల పరిష్కారం, 8వ తేదీన తుది జాబితా ప్రచురణ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో మార్పు, చేర్పులకు సంబంధించి లేదా కొత్త ఓటరుగా నమోద్‌కు సంబంధించి పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితాకు సం బంధించి అన్ని ఫారాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలపై బీఎల్‌వోలకు ఈనెల 11న ఒక విడుత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ శిక్షణకు జిల్లాలో బీఎల్‌వోలుగా నియమింపబడిన వార ందరూ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...