ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద


Tue,September 11, 2018 01:40 AM

గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి/అమ్రాబాద్ రూరల్ : ప్రాజెక్టులకు నెల రోజులుకు పైగా వరద కొనసాగుతూనే ఉన్నది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి స్వల్పంగా వరద రావడంతో సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 37,288 వేల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 89,752 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టులో నీటి మట్టం 879.70 అడుగులతో 186.4214 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి ఏపీ పవర్ హౌస్ ద్వారా 18,611 క్యూసెక్కులు, తెలంగాణ పవర్ హౌస్ నుంచి 42,378 క్యూసెకుకలు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే హంద్రినివా ప్రాజెక్టుకు 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 24,000 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

జూరాలకు తగ్గిన వరద
జూరాలకు క్రమంగా వరద ప్రవాహం తగ్గిపోతుంది. సోమవారం జురాల ఇన్‌ఫ్లో 13,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 43,622 క్యూ సెక్కులు నమోదైంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో పవర్ హౌస్ ద్వారా 37,288 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా కుడి కాలువ ద్వారా 795 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1400 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 835 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్ట్-1 ద్వారా 1300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు, నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎగువనున్న కర్నాటకలోని ఆల్మట్టి ఇన్‌ఫ్లో 18,900 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 18,900 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ ఇన్‌ఫ్లో 18,080 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 16,790 క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్ర ఇన్‌ఫ్లో 7,921 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 11,038 క్యూసెక్కులుగా నమోదైంది.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...