అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి


Sun,September 9, 2018 03:01 AM

గోపాల్‌పేట : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వనపర్తి జిల్లాను సా ధించుకున్నామని, జిల్లా అభివృద్ధికి అ హర్నిషలు శ్రమించానని, అభివృద్ధిని చూసి జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలో గ్రా మానికి చెందిన 200మందికి పైగా యాదవులు గ్రామ గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు పుల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో కాలం చెల్లిందని, టీడీపీ నూటికి నూరు పాళ్లు ఆంధ్రా పా ర్టీ అని, కాంగ్రెస్ వల్ల ప్రజలకు వరిగిందేమీ లేదన్నారు. ఈ సారి ప్రజల తీర్పు ఏక పక్షంగా టీఆర్‌ఎస్‌కు ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు అన్ని వర్గా ల అభివృద్ధికి కృషిచేసిందన్నారు. రాను న్న రోజుల్లో జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, వేరుశనగ విత్తన కేంద్రాన్ని ఏ ర్పాటు చేయిస్తామన్నారు.

మండలం లో రూ.10లక్షలతో యాదవుల కోరిక మేరకు యాదవ సంఘ భవనం ఏర్పా టు చేస్తానని, అందుకు కావల్సిన స్థలా న్ని చూసుకోవాలని సూచించారు. మం డలంలోని ఎగువ ప్రాంత ఆయకట్టుకు ఎంజీకేఎల్‌ఐ సాగునీరు అందించేందుకు బద్దారం గండి సమీపంలో మాలవాగు నుంచి కాలువ ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు. మండలంలో ఏదుల రిజర్వాయర్ ఎ ప్పుడూ నిండుకుండలా ఉంటుందని, దీంతో పాటు మరో 10ఆన్ లైన్ రిజర్వాయర్లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో సాగు, తాగు నీటికి డోకా ఉండదన్నారు. అంతకు ముందు గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి, గొర్రె పిల్లను బహుకరించారు. కార్యక్రమం లో జిల్లా గొర్రెల కాపరుల సంఘం అ ధ్యక్షుడు కురుమూర్తియాదవ్, ఉపాధ్యక్షుడు చంద్రయ్యయాదవ్, ఎంపీపీ జా నకిరాంరెడ్డి, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ కొత్త రామారావు, నాయకులు రా ములు, పరుశురాములు యాదవ్, శ్రీనివాసులు, గాజుల కోదండం, బాల్‌రాజు, చంద్రశేఖర్, సత్యనారాయణ, వెంకటేశ్, మతీన్, దేవదాసు, వెంకటయ్య యాదవ్, శ్రీశైలం, కురుమయ్య యాదవ్, పర్వతాలు యాదవ్, బంగారయ్య, రాములు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...