తెలంగాణ ఉద్యమ చరిత్రపై ప్రత్యేక తరగతులు


Sun,September 9, 2018 02:59 AM

వనపర్తి క్రెం : పోటీ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులకు తెలంగాణ ఉద్యమ చరిత్రపై శనివారం జిల్లా కేంద్రంలోని దాచాలక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో పరవస్తు సంస్థ నిర్వాహకులు మధుకర్‌స్వామి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉచితంగా ప్రత్యేక తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తరగతులను ఆ సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన భాగ్యకిరణ్ ఇన్‌స్టూట్ అధినేత ప్రొఫెసర్ గణేష్‌చే తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి వివరించారు. ఆదివారం వ్యక్తిక్త వికాసం మెమోరి వర్క్‌షాప్‌పై ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు కైలాష్‌చే ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ తరగతులకు వీఆర్‌వో, కానిస్టేబుల్, ఎస్సై, పంచాయతీ రాజ్ ఉద్యోగాలకు ఆైఫ్లెయి చేసిన అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి కృష్ణమూర్తి, సత్యసాయి ఆర్గనైజర్ రమేష్‌రెడ్డి, గాయకుడు శివలింగం, సంస్థ సభ్యు లు సత్తార్, భాస్కర్, గౌస్, రాజాగౌడ్, నగేష్, శంకర్‌ప్రసాద్, తిరుపతయ్య, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...