కేసీఆర్ లాంటి సీఎం దేశంలో ఎవ్వరూ లేరు


Sun,September 9, 2018 02:59 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : కేసీఆర్ లాంటి సీఎం దేశంలో ఎవ్వరూ లేరని మక్తల్ తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హజరైన ఆయన మాట్లాడుతూ మూడు గంటల్లో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించిన ఘనుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. అసెంబ్లీని రద్దు చేయడం, ఎన్నికలకు సిద్ధం కావడం, అభ్యర్థులను ప్రకటించడాన్ని కేవలం మూడు గంటల్లో ప్రకటించి ఢిల్లీ శక్తుల గుండెల్లో దఢ పుట్టించిన ధీరుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలుగా హైదరాబాద్‌కు వెళ్లి, గంటలో మాజీలుగా మారి, వెంటనే అభ్యర్థిగా బయటకు రావడం జీవితంలో మరిచిపోలేని అనుభవమన్నారు. విమానం ఎక్కి ఢిల్లీకి రెండు మూడు సాైర్లెనా వెళ్లకుండా కేవలం హైదరాబాద్‌కు వెళితే టిక్కిట్ లభించడం స్వరాష్ట్ర పాలనలో దక్కిన గౌరవంగా చెప్పుకొచ్చారు.

తెలంగాణ గల్లీల సత్తాను ఢిల్లీకి చాటేలా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ఎలాంటి రికమెండ్లు, సిఫారస్సులు, మాట సహాయాలు లేకుండా సిట్టింగులకే టిక్కెట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నేటి నుంచి ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి కట్టుబడి శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్క కార్యకర్త తానే అధినాయకుడిగా భావిస్తూ ఇంటి పార్టీని గెలిపించుకోవాలన్నారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలన్నారు. విద్వేషాలు, వర్గ విబేధాలు మరిచి ప్రణాళికబద్దంగా పార్టీ విజయానికి కృషిచేయాలని కోరారు. ఆత్మకూరు పట్టణ అభివృద్ధి కోసం మున్సిపాలిటీకి రూ. 15 కోట్ల నిధులు, పట్టణ రోడ్డు విస్తరణ కోసం రూ. 12.80 కోట్లు మంజూరీ అయ్యాయని, మరో నాలుగు రోజుల్లో జీవో కూడా విడుదల కానుందని ఆయన స్పష్టం చేశారు. ఆత్మకూరు పట్టణం తప్పకుండా రెవెన్యూ డివిజన్‌గా అవతరిస్తుందని అన్నారు. రెండ్రోజుల్లో మక్తల్ కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్‌సింగ్, ఎంపీటీసీలు వెంకట నర్సింహారావు, సుదర్శన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, కోఆప్షన్ సిరాజ్ అహ్మద్, తిప్పారెడ్డి, అనిల్‌గౌడ్, జగన్మోహన్‌గౌడ్, మహమ్ముద్, వెంకట్రాములు, గోపాల్‌యాదవ్, రియాజ్, జమాల్, అనిల్ పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...