సీఎం సహాయ నిధి చెక్కు అందజేత


Sun,September 9, 2018 02:58 AM

వనపర్తి రూరల్ / ఖిల్లాఘణపురం : అభాగ్యులకు సీఎం సహాయనిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. చిన్న చింతకుంట మండలం మద్దూర్ గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి రూ.లక్షా50వేల చెక్కును ఆయన కుమారుడు సురేంధర్‌రెడ్డికి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో ఆయన శనివారం అందజేశారు. అలాగే ఖిల్లాఘణపురానికి చెందిన రాఘవేందర్‌గౌడ్ రూ.60, 500, మండలంలోని కమాలోద్దిన్‌పూర్‌కు చెందిన రవికి రూ.7,500లు, దొంతికుంటతండా, బలరాంనాయక్ రూ. 35వేలు, శ్రీనునాయక్ రూ.32,500, జమినీ రూ,27 వేలు, సోలీపూర్ గ్రామాలకు శ్రీనివాసులు రూ.38వేలు చెక్కులను ఆయన అందజేశారు. చెక్కుల మంజూరీకి కృషి చేసిన నిరంజన్‌రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యోగనందరెడ్డి, ఉత్తరయ్య,నరేందర్‌రెడ్డి, బంకల రవీందర్, రాములు, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, సింగల్ విండో అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వెంకట్‌రావు, మాజీ ఎంపీపీ వెంకటయ్య పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...