బీమాతో రైతన్నలకు భరోసా


Sun,September 9, 2018 02:58 AM

ఖిల్లాఘణపురం : రైతన్నలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆగారం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు బండారి జానకిరాములు, బాపమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వారికి మంజూరైన రూ.5లక్షల చెక్కలను శనివారం నిరంజన్‌రెడ్డి వారి నివాసాలకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబీమా పథకంలో రైతు నయా పైసా చెల్లించుకుండా ఎల్‌ఐసీ ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి బీమా చెల్లిస్తుందని, ఇందులో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో మొదటిసారిగా ఖిల్లాఘణపురంలో ఇద్దరు రైతులు మృతిచెందారని వారి కుటుంబాలకు అండగా ఎల్‌ఐసీ ద్వారా వచ్చిన రూ.5లక్షల బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణనాయక్, జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, సింగిల్‌విండో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వెంకట్రావు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...