ఒక్క అడుగూ బీడు ఉండొద్దు..


Sat,September 8, 2018 02:47 AM

-అన్ని చెరువులు, కుంటలను కృష్ణా జలాలతో నింపుతాం..
-రైతుల కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యం
-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-మోటర్ ద్వారా బలిజపల్లి ఎర్రగట్టు చెరువుకు నీటి విడుదల
పెద్దమందడి : ఒక్క అడుగు భూమి కూడా బీడుగా ఉండొద్దని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెద్దమందడి బ్రాంచ్‌కెనాల్ నుంచి వస్తున్న సాగునీటి వద్ద ఏర్పాటు చేసిన మోటర్‌ను శుక్రవారం ప్రారంభించి మండలంలోని బలిజపల్లి ఎర్రగట్టు చెరువుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతి చెరువు, కుంటలకు కృష్ణాజలాలను తీసుకువచ్చి అలుగులు పారిస్తానని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసుకుంటూ వచ్చి కరువు మండలమైన పెద్దమందడికి కూడా సీఎం కేసీఆర్ కృషి వల్ల సాగునీటిని తీసుకువచ్చామన్నారు. దీనిద్వారా మండలంలోని 22 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. బలిజపల్లి గ్రామ రైతులు ఎర్రగట్టు చెరువు నుంచి బసిరెడ్డి చెరువును నింపాలని రైతులు కోరగా, సానుకూలంగా స్పందించారు. ఇక నుంచి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని, ఎలాంటి దిగులు చెందకుండా సాగులో నిమగ్నం కావాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, ఖిల్లాఘణపురం జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు కొండయ్య, శరత్‌కుమార్, నాగరాజు తదితరులు ఉన్నారు.

అభివృద్ధిని చూసే స్వచ్ఛందంగా చేరికలు
వనపర్తి రూరల్ : నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు నిరంజన్‌రెడ్డి స్వగృహంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో చేస్తున్న అభివృద్ధి మరింత కొనసాగడానికే ముంద స్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వెళ్తుతున్నారని, అందుకు ప్రజలు ఆశ్వీరదించాలని కోరారు. పార్టీలో చేరిన వారి లో మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, ఢాకయ్య, వారు సభ్యుడు చిన్నయ్య, రాములు, బాలస్వామి ఉన్నారు. కార్యక్రమంలో ఉదయ్‌కుమార్, రామకృష్ణ, హర్షవర్ధన్‌రెడ్డి, భగవంతు యాదవ్, ధర్మశాస్త్రి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజు, ప్రభాకర్, ఉపసర్పంచ్ పుల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి, సందీప్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వడ్రంగుల సమస్యల పరిష్కారానికి కృషి..
నియోజకవర్గంలోని వడ్రంగి కార్మికుల కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన వంతు కృషి చేస్తానని నిరంజన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వడ్రంగి కార్మికులు మణయ్యచారి, శేఖరాచారి, విష్ణు చారి, బ్రహ్మంచారి, సింగోటం వెంకటస్వామితో పాటు 150 మంది కార్పెంటర్లు సూగురు వెంకటేష్ ఆధ్వర్యంలో నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిరుపేదలైన వారికి డబుల్‌బెడ్‌రూంలలో అవకాశం కల్పిస్తానని నిరంజన్‌రెడ్డి అన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...