టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం


Sat,September 8, 2018 02:47 AM

పెద్దమందడి (ఖిల్లాఘణపురం) : నాలుగున్నరేళ్ల పాటు పాటు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలుపిస్తాయని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖిల్లాఘణపురం మండలంలోని మామిడిమాడ, సల్కలాపూర్ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి టీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆదరణ ఉండేందుకు మొదటగా మామిడిమాడ, సల్కలాపూర్ గ్రామాలకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. ఇన్నేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 100 సీట్లు వచ్చేలా చేస్తాయన్నారు. దేశంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన, ఇవ్వని వాగ్ధానాలను నెరవేర్చారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు, నిరంతర విద్యుత్, సాగునీరు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.8 వేలు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్ వంటి తదితర పథకాలను పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో, రాష్ట్రంలో గులాబీ జెండా రెపరెపలాడాలని కోరారు. మీరంతా ఆశీర్వదిస్తే మీ కోసం పనిచేసేందుకు ఇంకా కృషి చేస్తానన్నారు. అమలవుతున్న పథకాలతో పాటు మరెన్నో కొత్త వాటిని కూడా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రలోభాలకు గురికాకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీని అందించి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు వెంకట్రావు, టీఆర్‌ఎస్ ఖిల్లాఘణపురం మండలాధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, టీఆర్‌ఎస్ పెద్దమందడి మండలాధ్యక్షుడు మేఘారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణయ్య, మాజీ సర్పంచ్ సామ్యనాయక్, నాయకులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...