టీఆర్‌ఎస్ సర్కార్‌తోనే తండాల అభివృద్ధి


Sat,September 8, 2018 02:47 AM

గోపాల్‌పేట : టీఆర్‌ఎస్ సర్కారుతోనే గిరిజన తండాలు అభివృ ద్ధి చెందాయని తండాలు మరిం త అభివృద్ధి చెందేందుకు ప్రభు త్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు టీఆర్‌ఎస్ గిరిజన నాయకుడు వంశీ నాయక్ తెలిపారు. తండాలకు బీటీ రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతగా శుక్రవారం మండల కేంద్రం లో బుద్దారం ధర్మతండా, జాం ప్లా తండాకు చెందిన టీఆర్‌ఎస్ గిరిజన నాయకులు సీఎం కేసీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం వంశీ నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గిరిజన తండాలకు ఎస్సీ, ఎస్టీ నిధులు కేటాయించి బీటీ రోడ్లు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వనపర్తి ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకుంటామన్నారు. ఈ సందర్భంగా తండాలకు బీటీ రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించిన నిరంజన్‌రెడ్డికి తండావాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శేఖర్ గౌడ్, కృష్ణారావు, హర్యానాయక్, రాజ్‌కుమార్, రాజునాయక్, చంద్యానాయక్, ఓంకా ర్, చంద్రయ్య, వెంకటయ్య, రాజు, అర్జునయ్య, చందూలాల్ తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...