నవోదయలో తెలంగాణ క్లస్టర్ లెవెల్‌ఎగ్జిబిషన్


Sat,September 8, 2018 02:46 AM

బిజినేపల్లి : మండలంలోని వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని 9 నవోదయ కళాశాల విద్యార్థులచే ఎగ్జిబిషన్ నిర్వహించారు. తెలంగాణ క్లస్టర్ లెవెల్ ఎగ్జిబిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని న వోదయ విద్యార్థులచే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించి 76 మంది విద్యార్థులు ఏర్పా టు చేసిన వివిధ రకాల స్టాల్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంఈవో భాస్కర్‌రెడ్డి, నవోదయ ప్రిన్సిపాల్ నాగరాజుకుమార్‌లు ప్రారంభించారు. బెంగళూరు నవోదయలో 11వ తేదీ నుంచి 12వరకు జరిగే రివిజనల్ క్లస్టర్ లెవల్‌లో ఇక్కడ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అక్కడి ఎగ్జిబిషన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తారని వారు పేర్కొన్నారు. ఈ స్టాల్స్‌ను పా లెం, బిజినేపల్లి, వట్టెం గ్రామాలకు చెం దిన విద్యార్థులు కూడా తిలకించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఉదయ్‌కుమార్, వెంకటేశ్వర్, అజయ్‌కుమార్, రామరాజుయాదవ్ పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...