బైక్ అదుపుతప్పి యువకుడి మృతి


Sat,September 8, 2018 02:46 AM

లింగాల : మండలంలోని రాంపూర్ శివారులో గల నిమ్మలబావి మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఎస్సై విష్ణు తెలిపిన వివరాల ప్రకా రం.. తెల్కపల్లి మండలం బొప్పెల్లి గ్రామానికి చెందిన గెంటెల కుర్మయ్య (28) అనే యువకుడు వల్లభాపూర్ గ్రామంలో మేస్త్రీ పనులు చేస్తున్నాడు. కాగా గురువారం రాత్రి మేస్త్రీపని ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా రాంపూర్ శివారులోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు మిషన్ భగీరథ కోసం తీసిన గోతిలో పడి మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారు జామున రాంపూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు పొలం పనులకు వెళ్తుండగా మృతి చెందిన కుర్మయ్యను గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనా స్థలాన్ని లింగాల, బల్మూర్ ఎస్సైలు విష్ణు, విక్రమ్‌లు పరిశీలించారు. మృతుడు అవివాహితుడు కావడంతో తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట దవాఖానకు తరలించారు. మృతుడి కుర్మ య్య తండ్రి గతేడాది మృతి చెందడంతో అన్ని తానై కు టుంబాన్ని పోషిస్తూ పెద్ద దిక్కుగా ఉన్న కుర్మయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు అం దరినీ కలిచి వేసింది. కుర్మయ్య మృతితో బొప్పెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...