స్కూల్ బస్సు ఢీకొని.. వృద్ధుడి దుర్మరణం


Sat,September 8, 2018 02:46 AM

నవాబ్‌పేట : మండలంలోని చౌడూర్ గ్రామానికి చెందిన ఊళ్ల జంగయ్య(65)అనే వృద్ధుడు స్కూల్ బస్సు ఢీకొని మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలకు చెందిన బస్సు సాయంత్రం తమ పాఠశాల విద్యార్థులను వదిలిపెట్టేందుకు చౌడూర్‌కు వెళ్లింది. విద్యార్థులను గ్రామంలో వదిలిపెట్టి తిరిగి వచ్చేందుకు బస్సును రివర్స్ తీసుకుంటుండగా వెనుకాల ఉన్న జంగయ్య అనే వృద్ధుడు బస్సు కిందపడటంతో రెండు టైర్లు అతడి శరీరంపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా బస్సు నడపడం వల్లనే జంగయ్య మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, సిద్ధార్థ పాఠశాల బస్సుకు ఇన్సూరెన్స్, ఇతర ఫిట్‌మెంట్లు లేని కారణంగా సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...