సిట్టింగ్‌లకే సీట్లు


Fri,September 7, 2018 02:07 AM

మహబూబ్‌నగర్,నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : రాష్ట్ర అసెంబ్లీ రద్దు అనంతరం రాజకీయ పార్టీల్లో వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏ రాజకీయపార్టీ నిర్ణయం తీసుకోని వి ధంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏకంగా ఒకేసారి మొత్తం 119 స్థానాలకుగాను 105 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో ఉమ్మడి జిల్లా పరంగాను 14 అసెంబ్లీల వారీగా అభ్యర్థులను పేర్లను వెల్లడించడంతోపాటు గులాబీదళంలో ఆనందం వెల్లువిరిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా వీటిలో 9 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారున్నారు. ఇక మిగిలిన మరో 4 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుంటే.. కొడంగల్‌లో టీడీపీ ఎమ్మె ల్యే కొనసాగారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీ రద్దు కావడం.. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లు వెల్లడి కావడంతో కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో హైరానా మొదలయింది.

అభ్యర్థులు ఖరారు..
ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో హుషారు నింపారు. కొల్లాపూర్‌కు జూపల్లి కృష్ణారావు, జడ్చర్లకు చర్నకోల లకా్ష్మరెడ్డి, వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు వీ శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్రకు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్‌కు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, నారాయణపేటకు రాజేందర్‌రెడ్డి, కొడంగల్‌కు పట్నం నరేందర్‌రెడ్డి, షాద్‌నగర్‌కు అంజయ్యయాదవ్, నాగర్‌కర్నూల్‌కు మర్రి జనార్దన్‌రెడ్డి, అచ్చంపేటకు గువ్వల బాలరాజు, కల్వకుర్తికి జైపాల్ యాదవ్, గద్వాలకు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌కు అబ్రహం పేర్లను ఖరారు చేస్తు సీఎం ప్రకటించారు.

ఎమ్మెల్యేలందరికీ అవకాశం
నాలుగున్నరేళ్లపాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలుగా కొనసాగిన అభ్యర్థులం తా నిత్యం ప్రజల మధ్య ఉండి అభివృద్ధిని భుజాన వేసుకున్న వారే కావడంతో ఎలాంటి సందేహం లేకుండా కొత్తగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేలుగా కొనసాగిన వారిలో జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డిలు మంత్రులుగా కొనసాగగా, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అం జయ్య యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిలు తాజా మాజీ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితేవీరందరికీ మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించడంతో ఇక నూతనో త్సాహంతో వీరంతా ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లబోతున్నారు.

కొడంగల్, అలంపూర్‌లకు కొత్త అభ్యర్థులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, అలంపూర్ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. అలంపూర్‌కు అబ్ర హం, కొడంగల్‌కు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిల పేర్లను ప్రకటించారు. అబ్రహం టీఆర్‌ఎస్‌లో చేరి ఉత్సాహంగా పని చేస్తుండగా, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ని త్యం కోడంగల్ నియోజకవర్గంలో చురుకుగా ప్రజల అవసరాలను తీరుస్తూ వచ్చారు. ప్రతిపక్షపార్టీల పరిధిలో ఉన్న ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లోను ప్రభుత్వ పరంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. అలంపూర్ నియోజవర్గానికి దాదాపు 700 కోట్ల రూపాయలతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంను సీఎం కేసీఆర్ మంజూరు చేయించి పనులను చేపట్టిన సంగతి విదితమే. కొడంగల్ నియోజకవర్గంలోనూ గత కొంత కాలంగా అభివృద్ది పనులను చేయడంలో జిల్లా మంత్రులు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఈక్రమంలో ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు కొత్త అభ్యర్థుల ప్రకటన ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఊపును తీసుకువచ్చింది.

ఆనందంలో గులాబీ దళం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీలకు ఒకేసారి టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. అన్ని నియోజకవర్గాల్లోను నాయకులు, కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఎలాంటి ఊగిసలాట లేకుండా వెలువడిన అభ్యర్థుల ప్రకటనతో కార్యకర్తల్లో కొత్త జోష్‌ను తీసుకువచ్చింది. అభ్యర్థుల ఖరారు ప్రకటన ద్వారా కార్యకర్తలంతా సంబురాల్లో మునిగిపోయారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...