సింగిరెడ్డికి సీటుపై..హర్షాతిరేకాలు


Fri,September 7, 2018 02:07 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని వనపర్తి నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించగానే వనపర్తి నియోజకవర్గంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి అధినేత వెంటే ఉన్న నిరంజన్‌రెడ్డికి టిక్కెట్ లభిస్తుందని ముందే తెలిసినా.. అధికారికంగా గురువారం మధ్యా హ్నం కేసీఆర్ ప్రకటించగానే కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వనపర్తి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, గట్టు యాదవ్, కమలమ్మ, ఇందిరమ్మ, ప్రమీలమ్మ, పార్వతి, ఖైరూన్ బేగం, ఆవుల రమేష్, కృష్ణయ్య, నేతలు అభిలాశ్, రాములు యాదవ్, శ్రీనివాసు లు తదితరులు సంబురాల్లో పాల్గొన్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ సంబురాలు నిర్వహించారు. వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న నిరంజన్‌రెడ్డికి పార్టీ టిక్కెట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. వనపర్తి ఓటర్లు గత ఎన్నికల్లో చేసిన పొరపాటును ఈసారి సరిదిద్దుకుంటారని పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా.. నియోజకవర్గం వీడకుండా అభివృద్ధి కోసం పాటుపడ్డారని అభిప్రాయపడ్డారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించి అపర భగీరథుడిగా పేరుగాంచిన నిరంజన్‌రెడ్డిని స్థానికులు నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పేర్కొంటున్నారని కార్యకర్తలు తెలిపారు. నిరంజన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపిస్తామని వారు స్పష్టం చేశారు. ఈసారి పార్టీ నేతలు, కార్యకర్తలు నిరంజన్‌రెడ్డి గెలుపు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు.

ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముందస్తు శాసనసభ్యుల జాబితాను గురువారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. వనపర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేరు మొదటి జాబితాలో ప్రకటించడం పట్ల మండలంలో టీఆర్‌ఎస్ నాయకులు బస్టాం డ్ వద్ద పటాకులు కాల్చి మిఠాయిలు పంపి ణీ చేసుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా ఎంపీపీ కృష్ణనాయక్ మాట్లాడు తూ ప్రజాదరణ పొందిన నాయకుడు నిరంజన్‌రెడ్డి అని రాబోయే ఎన్నికల్లో ఆ యన గెలుపు వందశాతం ఖాయమన్నారు. వనపర్తి కోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సమావేశంలో మాజీ ఎం పీపీ వెంకటయ్య, మాజీ సర్పంచ్ సామ్యనాయక్, ఎంపీటీసీ నిరంజన్‌గౌడ్, గోపాల్, వెంకట్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్, విక్రమ్, సత్యం, బాల్‌రెడ్డి, భూమయ్య, రామన్‌గౌడ్, శ్రీశైలం, సాయులు, మురళీదర్‌రెడ్డి, గోపి పాల్గొన్నారు.

రేవల్లిలో..
రేవల్లి : వనపర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేరు మొదటి జాబితాలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ సభ్యురాలు మహ్ముదాసలాం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు రాములు, నాయకులు బాలస్వామి, నిరంజన్, కుర్మయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలపై ప్రచారం
ఖిల్లాఘణపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేసిన్నట్లు ఎం పీపీ కృష్ణనాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ఎంపీపీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు డప్పులతో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కృష్ణనాయక్ మాట్లాడు తూ 70 ఏండ్ల పాలనలో లేని అభివృద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమా ర్థం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నా రు. కరువు మండలంగా ఉన్న ఖిల్లాఘణపురం మండలాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నిరంతరం కృషి చేసి మండలానికి సాగునీరు తీసుకువచ్చాడని చెప్పారు. ప్రభుత్వ పథకా లు అందరికీ చేరువయేందుకు నా యకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

శ్రీరంగాపూర్‌లో..
శ్రీరంగాపూర్ : తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి గురువారం టీఆర్‌ఎస్ నాయకులు గడపగడపకు తీరుగు తూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాన్ని మండల కేంద్రంలో విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు పృథ్వీరాజు, వెంకటస్వామి, జలీల్, వాహీదీన్, నవీన్‌రెడ్డి, గౌడనాయక్, పర్వతాలు, వెం కటేష్, బాల్‌చంద్రయ్య, సత్యంయాదవ్, మధుగౌడ్, రాజశేఖర్, సూరయ్య, కురుమయ్య, శ్రీనివాసులు ఉన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...