వనపర్తి జేసీగా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరణ


Fri,September 7, 2018 02:06 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : వనపర్తి జాయింట్ కలెక్టర్‌గా వేణుగోపాల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గద్వాల డీఆర్‌వోగా పనిచేస్తున్న ఆయ న పదోన్నతిపై వనపర్తి జేసీగా వచ్చారు. గురువారం మధ్యాహ్నం ఆయన జిల్లా కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. వనపర్తి ఆర్డీవో చంద్రారెడ్డి, తహసీల్దార్లు రాజేందర్‌గౌడ్, మల్లికార్జున్, శాంతిలాల్, లక్ష్మణరావు, విజయ భాస్కర్, ఏవో వెంకటకృష్ణ, డీఆర్‌డీవో గణేష్, శ్రీకాంత్ రావుతో పాటు పలువురు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని వనపర్తి నూతన జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వేణుగోపాల్ అన్నారు. గద్వాల డీఆర్‌వోగా పనిచేస్తూ.. అక్కడ కలెక్టర్, జేసీ బదిలీపై వెళ్లిన సమయంలో ఇన్‌చార్జి జేసీగా పనిచేశారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ గద్వాలకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్నా.. జిల్లా బాధ్యతలన్నీ దాదాపుగా వేణుగోపాల్ నిర్వహించారు. చక్కగా పనిచేసి ప్రజల నుంచి మెప్పు పొందారు. పేదలకు సేవ చేయడంలో ముందుంటారని పేరు గడించారు. ప్రాధాన్యత అంశాల పరంగా విధులు నిర్వహిస్తామని జేసీ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారికి అం దుబాటులో ఉంటామన్నారు. వనపర్తి జిల్లాకు పూర్తి స్థాయిగా పనిచేసిన నిరంజన్ వెళ్లిన తర్వాత సుమారు 6 నెలలుగా జేసీ పోస్టు ఖాళీగా ఉంది. డీఆర్‌వో చంద్రయ్య ఇన్‌చార్జి జేసీగా పనిచేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయి జేసీగా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...