బతుకమ్మ చీరల పంపిణీలో.. జాగ్రత్త వహించాలి


Fri,September 7, 2018 02:06 AM

వనపర్తి రూరల్ : జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బతుకమ్మ చీరల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చీరల పంపిణీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఎక్కడైనా చీరల పంపిణీ కార్యక్రమానికి ఇబ్బంది కలిగిస్తే కేసు నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో లక్షా 80 వేల చీరల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంపిణీకి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతందన్నారు. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మండల స్థాయిలో చీరల నిల్వకు ఒక గోదాంను గుర్తించాలని, చీరలు నిలువ ఉంచే పాయింట్లు శుభ్రంగా, పూర్తి భద్రతతో ఉండేలా ఎంపిక చేయాలన్నారు. ఈ బాధ్యత ఎంపీడీవోలు, తహసీల్దార్‌లపై ఉంటుందన్నారు. బతుకమ్మ చీరలు ఒక రోజు ముందుగా లేదా అదే రోజు గ్రామాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ చీరలు పంపిణీ చేసే అన్ని కేంద్రాల వద్ద బ్యానర్ల ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో జేసీ వేణుగోపాల్, ఇన్‌చార్జి డీఆర్‌వో వెంకటయ్య, మార్కెటింగ్ ఏడీ స్వర్ణసింగ్,డీఆర్‌డీవో గణేష్, పౌనసరఫరల డీఎం. లక్ష్మయ్య,డీఎస్‌ఓ రేవతి, మున్సిపల్ కమిషనర్ రజినికాంత్, ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...