చాకలి ఐలమ్మ జీవితం..అందరికీ ఆదర్శం


Thu,September 6, 2018 02:14 AM

-టీఆర్‌ఎస్‌తోనే రజకుల అభివృద్ధి
-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-నాగపూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

రేవల్లి : చాకలి ఐలమ్మ జీవితం మనందరికీ ఆ దర్శమని, ఆమె తెలంగాణాణ సాయుధ పోరాటంలో ముఖ్యభూమిక పోషించారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. బు ధవారం మండలంలోని నాగపూర్ గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన చాకలిఐలమ్మ విగ్రహాన్ని నిరంజన్‌రెడ్డి ఎమ్మెల్యే చిన్నారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాలగమనంతో పాటు కులవృత్తులలో మార్పులు జరుగుతున్నాయన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చదువు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రజకులు అభివృద్ధి చెందాలని కోరారు. కోరికమేరకు గ్రామంలో మోడ్రన్ దోబీఘాట్ ఏర్పాటు, రజకులను ఎస్సీల లో కలిపేందుకు సంపూర్ణంగా కృషిచేస్తానని ఆయ న అన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా కళాకారుడు శివనాగులు ఆధ్వర్యంలోని బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ రకాల జనపదాలతో స భను ఉర్రూతలూగించి ప్రజలను ఆకట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ముంపు గ్రామాలైన బండరాయిపాకుల, కొంకలపల్లి గ్రామస్తులు కలిసి త మకు అనువైన స్థలంలో కాకుండా కొంకలపల్లి శి వారు, రేవల్లి పెద్దగట్టు సమీపంలో ఇళ్లు నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని గ్రామస్తు లు నిరంజన్‌రెడ్డికి వివరించారు. దీనివల్ల గట్టుకు సమీపంలో ఊరు ఉండడం అనువు కాదని, అదేవిధంగా గ్రామంపై గట్టునీడ పడుతుందని తెలిపా రు. ఇందుకు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, నాగం తిరుపతిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సుల్తాన్‌అలీ, నాయకులు రాములు, రఘు, సురేందర్‌రెడ్డి, బిచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్త కారును నడిపిన నిరంజన్‌రెడ్డి..


వనపర్తి రూరల్ : మండలంలోని కుడుకుంట్ల గ్రామానికి చెందిన ఎండీ. ఉస్మాన్ కు మైనార్టీ సంక్షేమం ద్వారా సబ్సి డీలో వచ్చిన కారును నిరంజన్‌రె డ్డి రిబ్బన్ కట్ చేసి నడిపారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుడికి పలు సూచన లు చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడుకుంట్ల గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సవాళ్లను అధిగమిస్తేనే ఉత్తములువనపర్తి విద్యావిభాగం : సవాళ్లను అధిగమిస్తేనే ఉ త్తమ ఉపాధ్యాయులుగా రాణిస్తారని డీఈవో సుశీందర్‌రావు, ఆర్డీవో చంద్రారెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నా రు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం స్థానిక తరుణి ఫంక్షన్‌హాల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను స న్మానించారు. ముఖ్య అతిథులు ముందుగా జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తూ, వృత్తిలోని నైపుణ్యా న్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ సరైన బోధనతోనే సంతృప్తి పొందుతారన్నారు. విలువలు నేర్పేవారే గురువులని, అలాంటి వారికి సమాజంలో ఎప్పటికీ ప్రముఖ స్థానం ఉంటుందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ యునివర్సిటీ ప్రొఫెసర్‌గా, రాష్ట్రపతిగా విశేషమై న సేవలు అందించారని, తన వేతనంలో 70 శాతం విశ్వవిద్యాలయాలకు విరాళం చేసేవారని గుర్తు చేశా రు. ఎందరో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అం దరినీ సన్మానించుకోవడం ఒకేసారి కుదరదని, విడతల వారిగా సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దరఖాస్తులు లేకుండా ప్రతిభ ఆధారంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం అభినందనీయమని ఉపాధ్యాయ సంఘాల నేతలు డీఈవోకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..


వృత్తిలో నిబద్ధతతో సేవలు అందించిన ఉపాధ్యాయులను సన్మానించారు. అందులో జీహెచ్‌ఎంలు ముగ్గురు, స్కూల్ అసిస్టెంట్లు 11 మంది, పీడీ ఒక్కరు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ముగ్గురు, తెలుగు పండిట్‌లు ఇద్దరు, భాషా పండిట్‌లు ఇద్దరు, ఎస్‌జీటీలు 16 మం దిని సన్మానించారు. వారిలో ఉమాదేవి, వీరారెడ్డి, విజయ్‌కుమార్, నరసింహ, శాంతన్న, శివరాజు, లక్ష్మీప్రసన్న, చంద్రశేఖర్, భాస్కర్, దశరథ, అరవింద్ ప్రకా ష్, సుదర్శన్‌రావు, బాలస్వామి, సుధారాణి, సుధీర్‌రె డ్డి, రాములు, సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరమ్మ, చంద్రశేఖర్, జయంత్‌రెడ్డి, ఎండి.అక్తర్, తాజుద్దీన్, బక్కన్న, జ్యోతి, అనితారాణి, పాండురంగయ్య, లక్ష్మణ్‌గౌడ్, బోయ శ్రీనివాస్, నరసింహరావు, చిన్నయ్య, మదన్‌లాల్, సునితారాణి, మల్లికార్జున, మోహినుద్దీన్, సాదియాబే గం, రామన్‌గౌడ్, కృష్ణయ్య, రామచంద్రమ్మ ఉన్నారు.

స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు అందజేత..


2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు అందజేశారు. టాయిలెట్ల నిర్వహణ, శుభ్రత, నీటి సరఫరా, తాగునీరు, డ్రై నేజీ, ట్యాబ్స్, పరిసరాల ఆరోగ్యం, పచ్చదనం తదిత ర నిర్వహణ కోసం స్వచ్ఛ పురస్కారాలను అందజేశా రు. పాఠశాలల పచ్చదనం రేటింగ్‌లో ప్రాథమికోన్నత పాఠశాల కేశంపేట, అన్ని విభాగాల కేటగిరీలలో 8 పాఠశాలలు, మిగతా విభాగాలలో సబ్ క్యాటగిరీ విభాగాలలో 32 పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కరాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, ఎంపీపీ శంకర్‌నాయక్, కౌన్సిలర్ శ్రీధర్, తిరుమల్, ఎంఈవో వెంకట్‌రాంరెడ్డి, జిల్లా నోడల్ అ ధికారిణి వరలక్ష్మీ, పరీక్షల విభాగ అధిపతి మధుకర్, సెక్టోరియల్ అధికారులు గణేష్, చంద్రశేఖర్, శివకుమార్ తదితరులు ఉన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...