బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం


Thu,September 6, 2018 12:31 AM

కోస్గీటౌన్ : కోస్గిలో ఓ బైక్‌ను డీసీఎం ఢీకొట్టిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బుధవారం ప్రభుత్వ దవాఖాన ముందున్న కూరగాయల మార్కెట్ దగ్గర హైదరాబాద్ నుంచి సబ్బులలోడ్ వస్తున్న డీసీఎంకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డీసీఎం డ్రైవర్ అప్రమత్తంగా ఉండి జనాలపై పోకుండా డీసీఎంను పక్కకు తీసుకున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న డీసీఎం మీదకు రావడాన్ని గమనించి బైక్‌ను వదిలి పక్కకు దూకడంతో డీసీఎం బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...