కూలిన వంతెన - బోల్తా పడ్డా టిప్పర్


Thu,September 6, 2018 12:31 AM

వెల్దండ : మండలంలోని కోనేటివాడ, గాన్‌గట్టుతండా వెళ్లే రహదారిలో ఉన్న రోడ్డు వంతెన ఒక్క సారిగా కుప్ప కూలింది. మండలంలోని చెర్కూర్ గ్రామం నుంచి కోనేటివాడ తండాకు వెళ్లే రహదారి దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించి వంతెన పూర్తిగా శిథిలావస్థలకు చేరింది. బుధవారం తెల్లవారు జా మున టిప్పర్ డస్ట్ పోసుకొని గాన్‌గట్టుతండా నుంచి చెర్కూర్‌వైపు వస్తున్నండగా వంతెన పైకి రాగానే బైకు ఎదురుగా వచ్చింది. దీంతో వంతెనపై లారీ పక్కకు నిలబెట్టి ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి టిప్పర్ వంతెన కిందికి బోల్తా పడింది.. టిప్పర్‌లో ఉన్న వారు ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈ మేర కు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...