సాగునీటి కోసం స్వచ్ఛందంగా


Thu,September 6, 2018 12:27 AM

గోపాల్‌పేట : మండలంలోని పొల్కెపహాడ్, బుద్దారం లక్ష్మీతండాకు చెందిన రైతులు తమ పొలాలకు ఎంజీకేఎల్‌ఐ సాగునీరు పారించుకునేందుకు సంఘటితమై స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములను ఇచ్చారు. భూములివ్వడమే కాకుండా దగ్గరుండి మరీ పనులు వేగవంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పొల్కెపహాడ్ గ్రామానికి చెందిన జెన్‌కో రిటైర్ట్ ఎస్‌ఈ మందతిరుపతిరెడ్డి కాలువ నిర్మాణ పనులు చేపడుతున్నారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. రైతులు దగ్గరుండి కాలువ పనులు చేయించుకుంటున్నారు. కాలువ ఏర్పాటుకు కావాల్సిన భూమి ఇచ్చిన రైతులు సైతం తమ పొలాలలకు కేఎల్‌ఐ సాగు నీరు పారుతుందనే ఆనందంలో పనుల వద్ద ఉంటూ పనులు వేగంగా జరిగేందు కు సహకరిస్తున్నారు. మొగుళ్ల చెరువు నుంచి సు మారు 3కిలోమీటర్ల దూరం కాలువ ఏర్పాటు చేయనున్నారు.

ఈ కా లువ ద్వారా పొల్కెపహాడ్ శివారులోని కొత్త కుంట, బలిజకుంట, బాల్‌రెడ్డికుంట, దొడమోనికుంట, రేగులకుంట, మద్దెనోనికుంట బుద్దారం-కొత్తకుంట, గోపాల్‌పేట శివారులోని నీలయ్య కుంటలు కేఎల్‌ఐ నీటితో నింపుకోవచ్చు. ఈ కుంటల ద్వారా 600ఎకరాల ఆయకట్టుకు సా గునీరు అందుతుంది. బీడు పొలాలు సైతం సాగులోకి రా నున్నాయి. కాలువకు అడ్డుగా ఉన్న బండరాళ్లను బ్లాస్టింగ్ చే సి బండరాళ్లను తొలగించుకుం టూ పనులు ముందుకు సాగుతున్నాయి. రాబోవు రోజుల్లో మొగుళ్ల చెరువు ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా మారనుంది. దీంతో ఈ చెరువు ద్వారా వేల ఎకరాలకు కేఎల్‌ఐ సాగు నీరు అందనుంది. మొగుళ్ల చెరువు రిజర్వాయర్‌గా గ్రామస్తులకు పెద్ద ఆదెరువుగా మారనుంది. మరో పదిహేను రోజుల్లో కాలువ పనులు పూర్తి కానున్నాయి.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...