అంధత్వ నివారణకే కంటివెలుగు


Thu,September 6, 2018 12:26 AM

వనపర్తి వైద్యం : అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని వనపర్తి కౌన్సిలర్ నందిమళ్ల భువనేశ్వరి అ న్నారు. బుధవారం పట్టణంలోని బండారునగర్‌లో ఏర్పాటు చేసిన కంటివెలుగు క్యాంపును రి బ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధ ప డుతున్న వారికి కంటివెలుగు కార్యక్రమం ఒక గొప్ప వరమని, పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న సదుద్దేశ్యంతో సీ ఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అ న్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం నేటితో 14వ రోజుకు చేరుకుందని, కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని ఆమె అన్నారు.

కాగా, జిల్లా పరిధిలో మొత్తం 25519కి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3679 మందికి కంటి అద్దాలు ఇవ్వగా, 3591 మందికి శస్త్రచికిత్స నిమిత్తం రెఫర్ చేయగా, 6360 మందికి రెఫరింగ్ గ్లాసులు ఇవ్వనున్నారు. క్యాట్రాక్ట్ 1747, కంప్లీట్ క్యాట్రాక్ట్ 10, కార్నియా 88, గ్లకొమ 9, క్రిటాజియం 440, స్కింట్ 59, సస్పెక్టెడ్ అమ్లీబియా 5 మందికి ఉందని కంటిపరీక్షలో తేలినట్లు డాక్టర్లు తెలిపారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...