వడ్డెరల పోరాటం న్యాయమైనదే..


Wed,June 20, 2018 03:28 AM

వనపర్తి రూరల్ : రాష్ట్రంలోని వడ్డెరలు వారి హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటం న్యాయమైనదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నాగవరం శివారులోని లక్ష్మీకృష్ణ గార్డెన్‌లో వడ్డెర హక్కుల సాధన కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వడ్డెర మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్ అధ్యక్షత వహించగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వడ్డెరులను ఎస్సీ, ఎస్టీలలో చేర్చాలనె డిమాండ్ సహేతుకమైనదని, గతంలో చల్లప్ప కమిషన్ ఏర్పాటు సందర్భంలో కూడా మీరు ఎన్నో వినతులు అందించారు. కానీ వాటిలో సారాంశాన్ని పూర్తి స్థాయిలో వివరించలేక పోయారు. అయినా వాటిని సీఎం దృష్టి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకొని మీకు హక్కులను కల్పించేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. గత 15 సంవత్సరాలు సంఘం బలోపేతం కోసం వేముల వెంకటేశ్ ఎంతో కృషి చేస్తున్నారని, ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వడ్డెరలను మేలుకొల్పడం అభినందనీయం అన్నారు.

గతంలో సమైక్య పాలనలో జరిగి అన్యాయనికి గురి చేసిన నాయకులు ఇప్పటికి తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత కూడా ఇక్కడి నాయకులు సీఎం ఏం చేయాలనుకున్నా వాటిలో ఇబ్బందులకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నారన్నారు. అయినా వాటిని అధిగమించి సీఎం ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. మీ సమస్యలపై మీ ముఖ్యమైన నాయకులను సీఎం తోటికి తీసుకెళతామని, సీఎం నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. అలాగే గుట్టలు, క్యారీలకు సంబంధించిన సమస్యలు ఏ జిల్లాలో ఆయా జిల్లా అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం ఫెడరేషన్‌కు కేటాయించిన నిధులు తక్కువనేనని, వాటిని పెంచేందుకు ప్రభుత్వానికి ఒక నివేదిక అందిస్తామని, అలాగే ఇతర కుల వృత్తుల వారి మాదిరిగానే వడ్డెర కుల వృత్తులలో పని చేస్తున్న వారికి పింఛన్లు అందించేలా ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు. వడ్డెరలకు డబుల్ బెడ్‌రూంలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, నామినేటెడ్ పోస్టులు తదితర అంశాలు సీఎం చేతులలో ఉంటుందని వీటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని వివరించారు. జిల్లాలో వడ్డెర భవన నిర్మాణానికి స్థలం ప్రభుత్వ పరంగా కచ్చితంగా పావు ఎకరా నుంచి ఎకరం వచ్చేటట్లు చూస్తామని, అలాగే ఫండ్ కూడా తెచ్చి భవన నిర్మాణ భూమి పూజ చేద్దామని ప్రకటించారు. అంతకుముందు కళాజాత బృందంచే వడ్డెర జాతిపై పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మహాసభలో వడ్డెర సంఘం నాయకులు భూమన్న, బంగారయ్య, లింగస్వామి, చెన్నయ్య, చంద్రయ్య, కౌన్సిలర్ వాకిట శ్రీధర్, మార్కెట్ యార్డు చైర్మన్ రవి తదితరులు పాల్గొన్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...