భూ రికార్డుల ప్రక్షాళనలో మూడో స్థానంలో జిల్లా


Wed,November 20, 2019 12:27 AM

-భూ రికార్డుల ప్రక్షాళనతో ఏండ్ల నాటి భూ సమస్యలకు పరిష్కారం
-ఇప్పటి వరకు 2,50,035ఖాతాలకు డిజిటల్ సంతకం పూర్తి
-సంబంధిత రైతులకు చేరిన పట్టాదారు పాసుపుస్తకాలు
-నేరుగా పోస్టాఫీసు ద్వారా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేత
-మరో 16,678 మంది రైతులకు అందని పట్టాదారు పాసు పుస్తకాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో 93.25శాతం రికార్డుల ప్రక్షాళనతో రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళనలో మూడో స్థానంలో జిల్లా నిలిచింది. భూ రికార్డుల ప్రక్షాళనపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఎప్పటికప్పుడు అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశమై భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. అదే విధంగా జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 93శాతం పూర్తి కాగా, మరో 7శాతం మాత్రమే రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు పార్ట్-బి (వివాదాస్పద) భూముల సమస్యలకు సంబంధించి ఎక్కువగా కోర్టు కేసులతో పాటు అసైన్డ్, దేవాదాయ తదితర భూ సమస్యలుండగా, పార్ట్-బి భూముల సమస్యలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి పలు వివాదాస్పద భూ సమస్యలకు పరిష్కారం చూపిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఒక్కొ భూ సమస్యను పరిష్కరిస్తుంది. అదే విధంగా మొదటి విడుతలో పట్టాదారు పాసుపుస్తకాలు రాని రైతులందరికీ ప్రస్తుతం ప్రతి నెల జిల్లాకు సీసీఎల్‌ఏ నుంచి వస్తున్నాయి. అయితే గతంలో మాదిరిగా రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి లేకుండా పోస్టల్ విధానం ద్వా రా నేరుగా రైతులకే పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందజేస్తుంది. అయితే జిల్లా వ్యాప్తంగా మరో 16,678మంది రైతులకు మాత్ర మే పట్టాదారు పాసుపుస్తకాలు అందా ల్సి ఉంది. అదే విధంగా జిల్లాలో మొ త్తం 2,68,126రైతు ఖాతాలు ఉండగా ఇప్పటివరకు 2,52,806ఖాతాలకు పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం పంపిణీ చేసింది. అదే విధం గా గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను భూ రికార్డుల ప్రక్షాళనతో పరిష్కారం కావడంతో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2,50,035 ఖాతాదారులకు పాసుపుస్తకాలు జారీ...
జిల్లా వ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన 93శాతం మేర పూర్తయ్యింది. జిల్లాలో ఇప్పటి వరకు 2,50,035ఖాతాదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యా యి. మరో 7శాతం మంది రైతులకు మాత్రమే పట్టాదారు పాసుపుస్తకాలు అందా ల్సి ఉంది. అయితే జిల్లాలో రికార్డుల ప్రక్షాళనలో అత్యధికంగా కుల్కచర్ల మండలంలో 98.67శాతం పూర్తికాగా, బొంరాస్‌పేట్ మండలంలో 97.53శాతం రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యింది. అదే విధంగా అత్యల్పంగా పూడూర్ మండలంలో 87.08 శాతం, వికారాబాద్ మండలంలో 89.54శాతం రికార్డుల ప్రక్షాళన పూర్తికాగా మిగతా అన్ని మండలాల్లో 90శాతానికి పైగా రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తి కావడం జరిగింది. అయితే డిజిటల్ సంతకం పూర్తై, పట్టాదారు పాసుపుస్తకాలు అందిన రైతులకు సంబంధించి వివరాలు .. బంట్వారం మండలంలో 6068మంది రైతులకు, ధారూర్ మండలంలో 13, 314, దౌల్తాబాద్ మండలంలో 16,297, కొడంగల్ మండలంలో 15,187, వికారాబాద్ మండలంలో 17,194, పరిగి మండలంలో 16,804, బొంరాస్‌పేట్ మండలంలో 16,472, పూ డూర్ మండలంలో 15,302, మర్పల్లి మండలంలో 15,935, మోమిన్‌పేట్ మండలంలో 13,308, యాలాల్ మండలంలో 13,048, తాండూర్ మండలంలో 14,417, పెద్దేముల్ మండలంలో 12,845, బషీరాబాద్ మండలంలో 12,432, నవాబుపేట్ మండలంలో 14,782, కోట్‌పల్లి మండలంలో 7902, దోమ మండలంలో 14,036, కుల్కచర్ల మండలంలో 14,012మంది రైతులకు సంబంధించిన భూముల డిజిటల్ సంతకాలు పూర్తికావడంతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. మొదటి విడుతలో పంపిణీ చేయని పట్టాదా రు పాసుపుస్తకాలకు సంబంధించి ప్రస్తుతం ప్రతి 15రోజులకోసారి కొంతమేర పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రణ పూర్తై జిల్లాకు చేరుతున్నాయి. అయితే మొదటి విడుతలో పంపిణీ చేసిన మాదిరి కాకుండా పాసుపుస్తకాలు నేరుగా రైతులకు అందేలా జిల్లా రెవెన్యూ యంత్రాంగం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పోస్టాఫీసు ద్వారా రైతులకు నేరుగా పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తున్నారు. ఒకేరోజు ఎక్కువ మొత్తంలో పం పిణీ చేయడం అసాధ్యం కాబట్టి రోజుకు పదిచొప్పున పాసుపుస్తకాలను పోస్ట్‌మెన్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.

కేవలం 16,678ఖాతాదారులకు అందని పాసు పుస్తకాలు
జిల్లాలో 2,68,126ఖాతాలుండగా 16,678ఖాతాదారుల కు సంబంధించి ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకాల జారీ పెండింగ్‌లో ఉంది. అయితే ప్రధానంగా ఆధార్ కార్డు వివరాల ను అందజేయని రైతులకు సంబంధించిన పాసు పుస్తకాలే పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు వెళ్లడించారు. ఇప్పటికే పలుమార్లు ఆధార్ అనుసంధానం కోసం రైతులకు రెవెన్యూ సిబ్బంది ద్వారా సమాచారం అందించినప్పటికీ సం బంధిత రైతులు గ్రామాల నుంచి వలసలు వెళ్లడంతో ఆధార్‌కార్డుల వివరాలను అందజేయడంలేదని అధికారులు ప్రాథమికం గా గుర్తించారు. అంతేకాకుండా వీఆర్వో ల నిర్లక్ష్యంతోనే చాలా వరకు పట్టాదారు పాసుపుస్తకాల జారీ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు డబ్బులు ఆశించే చాలామంది రైతుల భూములను ఇతరుల పేరిట ఆన్‌లైన్‌లో తప్పుగా పొందుపర్చడం, ఖాతా నెంబర్లు తప్పులు రాయడం, సర్వే నెంబర్లను తప్పుగా నమోదు చేయడం, భూ విస్తీర్ణాన్ని తప్పుగా రాయడంతోనే రైతులు పాసు పుస్తకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్వోలు చేసిన తప్పిదాలతోనే ప్రస్తుతం రైతులు పాసుపుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

అయితే సంబంధిత సమస్యలపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 16,678 పట్టాదారు పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉండగా, అత్యధికంగా పూడూర్ మండలంలో 2207, వికారాబాద్ మండలంలో 1883, నవాబుపేట్ మండలంలో 1583, మర్పల్లి మండలంలో 1354, పరిగి మండలంలో 1437, కొడంగల్ మండలంలో1136, దౌల్తాబాద్ మండలంలో 817, తాండూర్ మండలంలో 703, పెద్దేముల్ మండలంలో 722, బషీరాబాద్ మండలంలో 635, ధారూర్ మండలంలో 217, బంట్వారం మండలంలో 469, మోమిన్‌పేట్ మండలంలో 1364, కోట్‌పల్లి మండలంలో 675ఖాతాదారులకు పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. అదే విధంగా జిల్లాలోని వివాదస్పద (పార్ట్-బి) భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి పాసుపుస్తకాలను జారీ చేస్తున్నారు. ఇందులో భాగం గా ఇప్పటికే పార్ట్-బి భూముల్లోని అసైన్డ్, వక్ప్, దేవాదాయ తదితర భూ సమస్యలను పరిష్కరించేందుకు ఊరూరా ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది. ఒక్కొక్కటిగా పార్ట్-బి భూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles