పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి


Wed,November 20, 2019 12:25 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరికి తడి, పొడి చెత్తపై అవగాహన కలి గి వుండాలని ఎమ్మెల్యే డా. ఆనంద్ అన్నారు. మంగళవారం 30రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 20వార్డు పాత గంజ్‌లో ఇంటింటికీ తిరిగి పరిసరా ల పరిశుభ్రతపై మున్సిపల్ అధికారు లు, మహిళా సంఘాల సభ్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమలో ఆయన మా ట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలం టే ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే చక్కటి ఆరో గ్యం సాధ్యపడుతుందని తెలిపారు. ప్రతి మహిళా ఇంటి నుంచి తడి,పొడి చెత్తలను మున్సిపల్ సిబ్బందికి వేరు వేరుగా అందించాలని సూచించా రు. ప్రతి ఒక్కరు ఇంటికి ముందర వృథానీరు ఇంకి గ్రౌండ్‌వాటర్ పెంపొందించేలా ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మాణం చేసుకోవాలన్నా రు. ఎవరికి వారు పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా దోమల పిచికారి మందు వేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా కాలనీల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, అంనత్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేశ్ కుమార్, ఉమాశంకర్, తిమ్మని శంకర్, మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్లు, పర్యావరణ పరిరక్షణ ఇంజినీర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ఏసు తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles