వరల్డ్ టాయిలెట్ల దినోత్సవం


Wed,November 20, 2019 12:24 AM

కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామం లో మంగళవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని మహిళా సంఘాల సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన కులకచర్ల ఏపీఎం శోభ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకొని స్వచ్ఛతా గ్రామంగా మార్చాలని అన్నారు. బహిర్గత మలవిసర్జనకు వెళ్లే వారిపై చర్య లు ఉంటాయని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం ద్వారా రూ. 12వేల పారితోషకం అం దుతుందని తెలిపారు. గ్రామం స్వచ్ఛతగా ఉండేందుకు తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌యార్డుకు పంపించాలని అన్నా రు. ప్రతి రోజు గ్రామ పంచాయతీ నుంచి చెత్తను తీసుకువెళతారని దీనికి గాను ప్రతి ఇంటిలో తడి,పొడి చెత్తా డబ్బలను ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరాదని అన్నారు. గ్రామంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిల్ల అంజిలమ్మ, సీసీ రాములు, వీవోఏలు నర్సింహులు, గోపాల్‌రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...