జనగణనపై చిత్తశుద్ధితో పని చేయాలి


Wed,November 20, 2019 12:24 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జనాభా లెక్కల కార్యక్రమంలో సంబంధిత అధికారులందరూ చిత్తశుద్ధితో, పూర్తి బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఏఎస్‌వోలతో జనాభా గణనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా మాట్లాడారు. ఎన్నికల్లో విధులు నిర్వహించినట్లే జనాభా గణనలో కూడా పూర్తి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. జనాభా లెక్కలన్ని ఈ దఫ ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లను నియామకం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో పని చేసిన అనుభవంతో పనులు నిర్వహించాలని సూచించారు. కొత్త గ్రామాలు, తండాల వివరాలు కూడా సరైన విధంగా నమోదు చేయాలని తెలిపారు. జిల్లా నుంచి డీఆర్‌డీవో, వ్యవసాయ శాఖ అధికారికి జనాభా లెక్కలపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీవో, జడ్పీ సీఈవో, విద్యాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అటవీ శాఖ అధికారులు, ఇన్ఫర్మేషన్ అధికారులందరూ జనాభా లెక్కింపు కార్యక్రమంలో నిర్వహించే సమావేశాలు, శిక్షణ తరగతులకు ఖచ్చితంగా హాజరై విజయంతం చేయాలని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జేసీ అరుణకుమారి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత మరో ముఖ్యమైన పనిగా జనాభా లెక్కింపు కార్యక్రమమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీకాంత్ రెడ్డి, సీసీవో రవిందర్, డీఆర్‌డీవో జాన్సన్, ఆర్డీవో వేణుమాదవ్ రావు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఏడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles