ప్రైవేటు విద్యార్థులకు మెంబర్‌షిప్ కార్డులు అందజేయాలి


Wed,November 20, 2019 12:24 AM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : ప్రైవేటు కళాశాలలో, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మెంబర్‌షిప్ కార్డుల ద్వారా డబ్బులు వసూలు చేయాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మెంబర్‌షిప్ కార్డులు ప్రవేశపెట్టి 10వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రూ.20లు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు రూ.40 చొప్పున వసూలు చేయాలన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యాసంస్థలకు మెంబర్‌షిప్ కార్డులు విద్యాసంవత్సారానికి రూ.300లు, సీనియర్ ప్రైవేటు విద్యా సంస్థలకు రూ.400 వసూలు చేయాలన్నారు. ఈ విధంగా వచ్చిన డబ్బుల మొత్తంలోంచి 15 శాతం రెడ్ క్రాస్ సంస్థ వారికి, 85 శాతం సాంఘిక కార్యకలాపాలకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు. సాంఘిక కార్యకలాపాలు అనగా ఫైర్ యాక్సిడెంట్లు, రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, వైద్య శిబిరాలు, స్త్రీలకు న్యాయపరమైన సలహాలు సూచనలపైన అవగాహన శిబిరాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడానికి కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఈ ఫీజులు మినహాయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో దశరథ్, రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధులు భక్తవత్సలం, సత్యనారాయణగౌడ్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...