ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి


Wed,November 20, 2019 12:24 AM

ధారూరు: గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగు దొడ్లు తప్పనిసరిగా నిర్మించుకోవాలని జిల్లా ఎస్‌బీయం కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామంలో వరల్డ్ టాయ్‌లెట్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థులచే గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మరుగు దొడ్లపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌బీయం కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటికి మరుగు దొడ్డిని నిర్మించుకోవాలని, నిర్మించుకోనివారుంటే వెంటనే వారు నిర్మించుకొని వాటిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మోమిన్‌కలాన్ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పూర్ణిమ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వీఏవో బాల్‌రాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles