దళారులకు విక్రయించి మోసపోవద్దు


Mon,November 18, 2019 11:53 PM

పెద్దేముల్‌ : రైతులు పత్తిని దళారులకు విక్రయించి మోసపోవద్దని కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పతంగి మంజులపాండు అన్నారు. సోమవారం మండల పరిధిలోని మారేపల్లి సుమిత్రా జిన్నింగ్‌ మిల్‌లో నూతనంగా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీపీ అనురాధ, వైస్‌ ఎంపీపీ మధులత, జడ్పీటీసీ ధారాసింగ్‌, స్థానిక ఎంపీటీసీ స్వప్న, కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ హరిసింగ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌లు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పతంగి మంజులపాండు మాట్లాడుతూ ప్రభుత్వం పత్తి పంటను పండిస్తున్న రైతులు నష్టపోకుండా పండించిన పంటలకు మద్దతు ధరను కల్పిస్తూ వారికి అందుబాటులో ఉండే విధంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా రైతుల సౌకర్యార్థం మారేపల్లి జిన్నింగ్‌ మిల్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషమన్నారు. ముఖ్యంగా రైతులకు ఈ కొనుగోలు కేంద్రంలో 8% తేమ ఉన్న పత్తికి రూ.5550, 9% తేమ ఉన్న పత్తికి రూ.5494, 10% తేమ ఉంటే రూ.5439, 11% తేమ ఉంటే రూ.5383,12% శాతం తేమ ఉంటే రూ.5328 మద్దతు ధరను అందించడం జరుగుతుందని అన్నారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించడానికి వచ్చే రైతులు తమ వెంట పట్టాపాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాసుబుక్‌ జిరాక్స్‌ కాఫీలను తీసుకురావాలని సూచించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...